Health Tips: ఆహారం తినేసమయంలో నీరు తాగుతున్నారా? ముందు ఈ నష్టాలు తెలుసుకోండి..

|

Mar 27, 2023 | 8:50 AM

మన అనుసరించే జీవనశైలే.. మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఏం తింటున్నాం.. ఏలా ఉంటున్నాం.. ఎప్పుడు పండుకుంటున్నాం.. అనేది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే, కొంతమందికి ఆహారం తినేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. కారణం.. తినే ఆహారం మింగడానికి సులువుగా ఉంటుంది. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి హానీకరం అని చెబుతున్నారు నిపుణులు.

Health Tips: ఆహారం తినేసమయంలో నీరు తాగుతున్నారా? ముందు ఈ నష్టాలు తెలుసుకోండి..
Eating Food
Follow us on

మన అనుసరించే జీవనశైలే.. మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఏం తింటున్నాం.. ఏలా ఉంటున్నాం.. ఎప్పుడు పండుకుంటున్నాం.. అనేది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అయితే, కొంతమందికి ఆహారం తినేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుంది. కారణం.. తినే ఆహారం మింగడానికి సులువుగా ఉంటుంది. అయితే, ఇలా చేయడం ఆరోగ్యానికి హానీకరం అని చెబుతున్నారు నిపుణులు. ఆహారం ఎప్పుడు తిన్నా సరే నీళ్లు తాగొద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఆహారం తినేటప్పుడు నీళ్లు ఎందుకు తాగొద్దు..

ఆహారం నోట్లోకి తీసుకున్న తరువాత దానిని నములుతాం. ఆ తరువాత నోట్లోని గ్రంథులు లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ లాలాజలంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేసే ఎంజైములు ఉంటాయి. ఈ ఎంజైమ్‌లు కడుపులోని ఆమ్ల గ్యాస్ట్రిక్ రసంతో మిళితం అవుతాయి. మందపాటి ద్రవాన్ని ఏర్పరుస్తాయి. ఈ ద్రవాలు చిన్న ప్రేగు గుండా వెళ్లి, పోషకాలను గ్రహించడంలో సహాయపడుతాయి.

ఇవి కూడా చదవండి

నీరు త్రాగడం జీర్ణవ్యవస్థను ప్రభావితం..

క్రమం తప్పకుండా నీరు త్రాగితే ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడమే కాకుండా, జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. అయితే ఆహారం తినే సమయంలో నీళ్లు తాగితే మన జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. అందుకే తినేటప్పుడు నీరు త్రాగడం మంచిది కాదు. నీరు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియలో సమస్యలను కలిగిస్తుంది. అంతేకాదు.. దీని కారణంగా పొట్ట పెరుగుతుంది. నెమ్మదిగా లావు అవుతారు. శరీర ఆకృతి పూర్తిగా చెడిపోతుంది.

ఆహారం తీసుకున్నాక ఎంతకాలం తరువాత నీరు తాగాలి?

సాధారణంగా, చాలా మంది ఆరోగ్య నిపుణులు ఆహారం తిన్న వెంటనే నీరు తాగొద్దని సూచిస్తారు. ఆహారం తీసుకున్న అరగంట తర్వాత మాత్రమే నీరు తాగడం మంచిది. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ కూడా బాగుంటుంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ప్రజల సాధారణ ప్రయోజనాలను ఉద్దేశించి మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వైద్యుల సలహా తీసుకోవడం ముఖ్యం.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..