Health Tips: ప్రస్తుత ఉరుకులు పరుగులు జీవితంలో ప్రజలు సంపాదనపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఆరోగ్యంపై కనీసం ఫోకస్ చేయలేకపోతున్నారు. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అస్తవ్యస్తమైన జీవన శైలే అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణమని చెప్పొచ్చు. సరైన సమయంలో తినకపోవడం, సరైన సమయానికి నిద్రపోకపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం కాకుండా జంక్ ఫుడ్స్ తినడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత కాలంలో కిడ్నీ సమస్యతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. అందులోనూ కిడ్నీల్లో రాళ్ల సతమతం అయ్యేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే, కిడ్నీలో స్టోన్స్ ఏర్పడినట్లు ముందుగా మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయిని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
కిడ్నీల్లో రాళ్లుంటే కనిపించే లక్షణాలివే..
1. కిడ్నీలో రాళ్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడమ భాగంలో నొప్పి వస్తుంటుంది. ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడమ వైపు నొప్పి ఉంటుంది. నొప్పి ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించాలి.
2. మూత్రం విసర్జించే సమయంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి.
3. కిడ్నీలో రాళ్లు ఏర్పడితే తరచుగా మూత్రం వస్తుంటుంది.
4. మూత్రం ఎరుపు రంగులో వస్తుంది. దుర్వాసన కూడా వస్తుంది.
Also read:
Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!
Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!
Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..