Health Tips: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే..!

|

Apr 20, 2022 | 8:35 PM

Health Tips: ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన కరోనా.. మళ్లీ పెరగడం ప్రారంభించింది. ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం ప్రారంభించాయి.

Health Tips: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని పాటించాల్సిందే..!
Covid Cases
Follow us on

Health Tips: ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన కరోనా.. మళ్లీ పెరగడం ప్రారంభించింది. ఒక్కసారిగా కరోనా కేసులు పెరగడం ప్రారంభించాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 2000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రభుత్వం మరోసారి ప్రజలని హెచ్చరిస్తోంది. ఇప్పటికే కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి దాని లక్షణాలు ప్రజలని వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉంటే మంచిది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ మహమ్మారికి దూరంగా ఉండవచ్చు.

1. యోగా చేయండి

యోగా శారీరక విశ్రాంతిని అందించడమే కాకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కరోనాను ఓడించడంలో యోగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ కోవిడ్ యుగంలో మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవాలనుకుంటే ప్రతిరోజూ యోగా చేయాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే కొన్ని యోగాసనాలు వేస్తే బాగుంటుంది. కచ్చితంగా మాస్క్‌ ధరించాలి.

2. ఆహారంపై దృష్టి పెట్టండి

ప్రతిరోజు తినే ఆహారంపై దృష్టి పెట్టండి. పోషకాలు సమృద్ధిగా ఉండే కూరగాయలని డైట్‌లో చేర్చుకోండి. రోగనిరోధక శక్తిని పెంచుకోండి. దీంతో కరోనా దరి చేరకుండా ఉంటుంది. అంతేకాదు వ్యాయామం కూడా ముఖ్యమే. సాధ్యమైనంత వరకు ఉదయం పూట వాకింగ్‌, రన్నింగ్‌ లాంటివి చేస్తే బాడీ ఫిట్‌గా ఉంటుంది.

3. ధ్యానం చేయండి

మనస్సు ప్రశాంతంగా ఉండటానికి ప్రతిరోజూ పది నుంచి1 5 నిమిషాలు ధ్యానం చేయండి. నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేయండి. ఊపిరి ఎక్కువగా తీసుకోండి. పరిశోధన ప్రకారం.. ఒక వ్యక్తి ధ్యానం చేసినప్పుడు ఒత్తిడి, ఆందోళనలు తగ్గుతాయి. క్రమం తప్పకుండా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

4. ఓపెన్ ఎయిర్ పొందండి

ఉదయం లేచిన తర్వాత చాలా మంది ప్రజలు ఫోన్‌లో నిమగ్నమై ఉంటారు. అయితే ఈ పద్ధతి ఆరోగ్యానికి హాని చేస్తుంది. బదులుగా బయటికి వెళ్లి బాల్కనీ లేదా తోటలో ఓపెన్ ఎయిర్ తీసుకోండి. ఈ సమయంలో హృదయానికి విశ్రాంతినిచ్చే సంగీతాన్ని వినండి. ఇలా చేస్తే మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మాస్క్‌ ధరించడం అస్సలు మరిచిపోవద్దు.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Credit Cards vs Personal Loan: క్రెడిట్‌ కార్డు వర్సెస్ పర్సనల్‌ లోన్.. ఈ రెండింటిలో ఏది బెటర్..!

IPL 2022: విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్

IPL 2022: పంత్‌ ఆ విషయం మరిచిపోయి ఆడాలి.. అప్పుడే జట్టు బాగా రాణిస్తుంది.. ఇండియన్‌ మాజీ కోచ్‌ కామెంట్స్‌..!