వంకాయ కూర అంటే చాలా మంది పడి చస్తారు. చాలా ఇష్టంగా తింటారు. గుత్తివంకాయ కూర అంటే గుటకలేసుకుంటూ తినేస్తారు. వంకాయ తినడానికి రుచిగా ఉండటంతో పాటు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, కొందరు మాత్రం వంకాయ కూరను తినకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాదని తింటే ప్రమాదం తప్పదని వార్నింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వంకాయ తినొద్దని చెబుతున్నారు నిపుణులు. గర్భిణీలతో పాటు మరికొందరు కూడా ఈ వంకాయను తినకూడదని చెబుతున్నారు నిపుణులు. మరి ఎవరు వంకాయను తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటే వంకాయతో చేసిన కూరలు తీనకూడదు. కారణం.. ఇది గ్యాస్ సమస్యలను మరింత పెంచుతుంది.
ఏదైనా అలెర్జీ సమస్య ఉన్నట్లయితే వంకాయను తినవద్దు. ఎందుకంటే దీనిని తినడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
డిప్రెషన్‌తో బాధపడుతూ మెడిసిన్స్ వాడుతున్నట్లయితే, లేదా ఇతర ఆందోళనలతో బాధపడుతున్నట్లయితే వంకాయ కూరను తినకుండా ఉండాలి. ఎందుకంటే.. ఇది సమస్యను మరింత పెంచుతుంది.
రక్త హీనతతో బాధపడేవారు వంకాయ కూర తినకూడదు. ఎందుకంటే ఇవి రక్తం పెరుగుదలకు అడ్డంకిగా పనిచేస్తాయి. ఈ కారణంగా రక్తం తక్కువగా ఉన్నవారు వంకాయ తినొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
కళ్లలో ఏదైనా సమస్య ఉన్నవారు వంకాయ కూరలకు దూరంగా ఉండాలి. కళ్లలో మంట, వాపు, దురద ఉంటే వంకాయ తినొద్దని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
పైల్స్‌తో బాధపడుతున్నట్లయితే వంకాయను తినొద్దని సూచిస్తున్నారు వైద్యులు. దీనిని తినడం వలన సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంది.
కిడ్నీలో రాళ్లు ఉంటే వంకాయను అస్సలు తినొద్దు. వంకాయలో ఉండే ఆక్సలేట్స్ రాళ్ల సమస్యను మరింత పెంచుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..