Health Tips: నీరసం, అలసటకు చెక్‌.. రోజంతా ఎనర్జిటిక్‌గా పని చేయాలంటే ఈ సూపర్‌ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే

|

Aug 02, 2022 | 10:11 AM

Health Care Tips: అదుపుతప్పిన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలితో నేడు చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక బిజీ షెడ్యూల్‌, నైట్‌షిఫ్ట్‌లంటూ రాత్రంతా మేల్కొటున్నారు. దీనివల్ల పని ఉత్పాదకత తగ్గడంతో పాటు వ్యక్తిగతంగా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి

Health Tips: నీరసం, అలసటకు చెక్‌.. రోజంతా ఎనర్జిటిక్‌గా పని చేయాలంటే ఈ సూపర్‌ఫుడ్స్‌ తీసుకోవాల్సిందే
Health Care Tips
Follow us on

Health Care Tips: అదుపుతప్పిన ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన జీవనశైలితో నేడు చాలామంది ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక బిజీ షెడ్యూల్‌, నైట్‌షిఫ్ట్‌లంటూ రాత్రంతా మేల్కొటున్నారు. దీనివల్ల పని ఉత్పాదకత తగ్గడంతో పాటు వ్యక్తిగతంగా పలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చిన్న చిన్న పనులకే నీరస పడిపోవడం, త్వరగా అలసిపోవడం లాంటి ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అందులోనూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అలసట, నీరసం నుంచి ఉపశమనం కలిగించే వివిధ రకాల ఫుడ్స్‌ను డైట్‌లో చేర్చుకోవచ్చు. ఇవి రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడతాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా బరువును తగ్గిస్తాయి. ఏకాగ్రతను పెంచడంతో పాటు అలసటను తొలగిస్తుంది. శరీరానికి తక్షణ శక్తినిస్తుంది. ఇందుకోసం రోజూ ఒక కప్పు గ్రీన్ టీ తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సోంపు

ఫెన్నెల్ (సోంపు) గొప్ప మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేయడమే కాకుండా నీరసం నుంచి ఉపశమనం కలిగించడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందులో కాల్షియం, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఎనర్జిటిక్‌గా ఉంచుతాయి.

పెరుగు

రోజూ ఒక గిన్నె పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ప్రొటీన్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అలసట, నీరసాన్ని కూడా దూరం చేస్తుంది

నీరు

తగినంత నీరు తాగడం ద్వారా మిమ్మల్ని మీరు ఆరోగ్యంగాఉంచుకోవచ్చు. పలు ఆరోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు. హైడ్రెటెడ్‌గా ఉండడం వల్ల శరీరానికి శక్తిని అందిస్తుంది. అదేవిధంగా అలసట, నీరసం కూడా దూరమవుతాయి.

ఓట్స్

ఓట్స్‌లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. అలాగే అలసట నీరసం తదితర సమస్యలను తొలగిస్తుంది. ఇక క్రమం తప్పకుండా ఓట్స్ తినడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

పండ్లు

అరటి పండులో పలు ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఇందులోని పిండి పదార్థాలు, మినరల్స్‌ అలసట, బద్ధకాన్ని దూరం చేస్తాయి. ఇక నారింజ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే ఇది శరీరాన్ని శక్తివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

పాలకూర

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను వేగవంతం చేస్తుంది. అలాగే కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే అలసట, బద్ధకాన్ని దూరం చేస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి