Health Problems: నిద్రలేమి సమస్యతో ఎన్నో అనర్థాలు.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..!

Health Problems: ప్రస్తుతం మానవుని జీవనశైలి మారిపోతోంది. ప్రతి నిత్యం బిజీ లైఫ్‌ను అనుభవిస్తున్నారు. ప్రతి మనిషికి నిద్ర అనేది తప్పనిసరి. నిద్రలేమి కారణంగా..

Health Problems: నిద్రలేమి సమస్యతో ఎన్నో అనర్థాలు.. నిపుణుల అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు..!

Updated on: Dec 21, 2021 | 2:08 PM

Health Problems: ప్రస్తుతం మానవుని జీవనశైలి మారిపోతోంది. ప్రతి నిత్యం బిజీ లైఫ్‌ను అనుభవిస్తున్నారు. ప్రతి మనిషికి నిద్ర అనేది తప్పనిసరి. నిద్రలేమి కారణంగా అనేక వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. సరైన నిద్ర లేకుండా రాత్రుల్లో ఫోన్‌ ఆపరేటింగ్స్‌, కంప్యూటర్ల ముందు కూర్చుండటంతో వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. మానవ శరీరానికి తగినంత నిద్ర ఉండాలి. సాధారణంగా ఒక వ్యక్తికి ఆరు నుంచి ఎనిమిది గంట నిద్ర అవసరమని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. ఒకవేళ తగినంత నిద్ర లేకపోతే.. మన జీవన శైలి మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నిద్ర సరిగ్గా లేకపోతే.. మానసిక ఒత్తిడితోపాటు అలసట, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. శరీరానికి తగినంత నిద్రలేకపోతే… మరణానికి దారితీస్తుందని ఇటీవల హార్వర్డ్ మెడికల్ స్కూల్ మెడిసిన్ బోధకుడు రెబెకా రాబిన్సన్ నిర్వహించిన అధ్యయనంలో తేలింది. శరీరానికి సరైన నిద్ర అనేది.. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

ఒత్తిడి సమస్యతో నిద్రలేమి..
ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది నిద్రలేమి. మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్లు.. ఒత్తిడి సమస్యలతో నిద్రలేమి బారిన పడుతున్నారు. ప్రపంచ జనాభాలో 45 శాతం మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. 5 నుంచి 70 మిలియన్ల అమెరికన్ పౌరులు స్లీప్ డిజార్టర్, స్లీప్ అప్నియా, నిద్రలేమి, రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారని నివేదికలో వెల్లడైంది. నిద్రలేమి కారణంగా రక్తంలో షుగర్ లెవల్స్ లో మార్పు, స్ట్రోక్, గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. 18 సంవత్సరాల మధ్య చాలా మంది నిద్రపోయే అలవాట్ల డేటాను ఈ అధ్యయనంలో భాగంగా పరిశీలించారు. నిద్రలేమి సమస్య ఉన్నవారిలో అనేక వ్యాధుల బారిన పడుతుంటారని అధ్యయనంలో తేలింది.

ఇవి కూడా చదవండి:

Hiccups: మీకు పదే పదే ఎక్కిళ్లు వస్తున్నాయా..? తగ్గిపోయేందుకు ఈ చిట్కాలు పాటించండి..!

Bone Weakness: బలహీనంగా ఉన్న ఎముకలను దృఢంగా మారాలంటే ఈ పదార్థాలను తీసుకోవాల్సిందే..!

Omicron Variant: ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఎక్కువగా వీరికే సోకుతుంది.. తాజా పరిశోధనలో వెల్లడి..!