Telugu News Health Health care Tips: What Happens When You Reheat Tea and Drink, Know Health Side Effects
Healthy Tea: ఉదయం చేసిన టీని పదే పదే వేడి చేసి తాగుతున్నారా? ఈ సమస్య రావొచ్చే జాగ్రత్త!
Healthy Tea: ఏ టీ అయినా తయారు చేసిన వెంటనే తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, ఒకసారి చేసిన టీ ని మళ్లీ మళ్లీ మరగబెట్టి చాలా సమయం తరువాత తాగితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఉదయం లేవగానే బ్రష్ చేసి, ఆ వెంటనే టీ తాగుతారు. మరికొందరు నిద్ర లేవడం లేవడంతోనే టీ, కాఫీ తాగుతారు. గతంలో టీ, కాఫీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు గ్రీన్ టీ, బ్లూ టీ, లెమన్ టీ అని రకరకాల టీలు అందుబాటులోకి వచ్చాయి.
Healthy Tea:ఏ టీ అయినా తయారు చేసిన వెంటనే తాగితే ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, ఒకసారి చేసిన టీ ని మళ్లీ మళ్లీ మరగబెట్టి చాలా సమయం తరువాత తాగితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఉదయం లేవగానే బ్రష్ చేసి, ఆ వెంటనే టీ తాగుతారు. మరికొందరు నిద్ర లేవడం లేవడంతోనే టీ, కాఫీ తాగుతారు. గతంలో టీ, కాఫీలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు గ్రీన్ టీ, బ్లూ టీ, లెమన్ టీ అని రకరకాల టీలు అందుబాటులోకి వచ్చాయి. టీ ఎలా ఉన్నా.. తయారు చేసిన వెంటనే తాగకపోతే ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. కొందరైతే.. టీని ఉదయం తయారు చేసి.. సాయంత్రం వరకు మళ్లీ మళ్లీ మరగబెట్టి అదే తాగుతుంటారు. అయితే, ఇలా తాగొద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలా తాగితే ఏం జరుగుతుందో ఓసారి చూద్దాం..
టీ చల్లారిన తర్వాత మళ్లీ మళ్లీ వేడి చేసి తాగడం వలన శరీరానికి హానీ కలుగుతుంది. మూడు నాలుగు గంటల ముందు వేడి చేసిన టీ తాగితే.. శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
అలాగే, టీ మొదట్లో ఉన్న రుచికరంగా, తాజాగా ఆ తరువాత ఉండదు.
టీ ని పదే పదే వేడి చేయడం వల్ల అందులోని పోషకాలన్నీ తొలగిపోతాయి. కోల్డ్ టీ బ్యాక్టీరియాను సృష్టిస్తుంది. టీ ని ఎంత ఎక్కువసేపు నిల్వ ఉంచితే.. అంత బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా హానీకరం.
పాలతో తయారు చేసే టీలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. వేడి చేసిన ప్రతిసారీ బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. వేడి చేసిన తరువాత మళ్లీ చల్లగా అయ్యే వరకు ఉంచి తాగొద్దు.