Health Tips: ఈ థెరపీతో ఏళ్ల నాటి నొప్పి కూడా పరార్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

|

Nov 06, 2022 | 6:03 AM

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఏదో ఒక వ్యాధి, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూనే ఉన్నారు. కొందరు తీవ్రమైన నొప్పితో ఏళ్లతరబడి బాధపడుతుంటారు.

Health Tips: ఈ థెరపీతో ఏళ్ల నాటి నొప్పి కూడా పరార్.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
Green Light Therapy
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఏదో ఒక వ్యాధి, అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూనే ఉన్నారు. కొందరు తీవ్రమైన నొప్పితో ఏళ్లతరబడి బాధపడుతుంటారు. ఆ సమస్య నానాటికి మరింత పెరుగుతుందే తప్ప.. తగ్గదు. నొప్పి, సంబంధిత సమస్యల కారణంగా వ్యక్తులు తమ పనిని తాము చేసుకోలేకపోతారు. అయితే, కొన్ని రకాల థెరపీలు, ట్రీట్‌మెంట్ చేయడం ద్వారా ఏళ్ల నాటి దీర్ఘకాలిక నొప్పి సైతం సులభంగా తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రీన్ లైట్ థెరపీ ద్వారా ఏళ్ల నాటి నొప్పులను కూడా తగ్గించుకోవచ్చు అని అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది.

ఈ చికిత్సను కూడా..

అధ్యయనం ప్రకారం.. అమెరికాలో 50 మిలియన్లకు పైగా ప్రజలు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యల కారణంగా తీవ్రమైన నొప్పి, అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఆక్యుపంక్చర్, మసాజ్, ఔషధంతో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ పద్ధతులు ప్రభావవంతంగా ఉన్నాయని నిరూపించే పరిస్థితి లేదు. ఒక్కోసారి డ్రగ్స్‌కు కూడా అలవాటు పడుతున్నారు. ఈ క్రమంలో గ్రీన్ లైట్ థెరపీ ద్వారా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుందని.. అమెరికాలోని డ్యూక్ యూనివర్శిటీలో ఒక పరిశోధన వెలువడింది.

గ్రీన్ లైట్ థెరపీ అంటే ఏమిటి?

గ్రీన్ లైట్ థెరపీ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ థెరపీలో, నొప్పితో బాధపడుతున్న రోగి.. గ్రీన్ లైట్ ఉన్న గదిలో గడపాలని సూచించారు. విశేషమేమిటంటే ఈ థెరపీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కనిపించలేదు. ఈ థెరపీ గురించి రెండు వారాల పాటు ప్రజలపై పరిశోధన చేశారు. ఇందులో ప్రతిరోజూ 4 4 గంటల పాటు ఎరుపు, ఆకుపచ్చ, నలుపు వంటి వివిధ రంగుల అద్దాలు ధరించాలని ప్రజలకు అందించారు. గ్రీన్ కలర్ వల్ల మనుషుల్లో నొప్పుల బెడద తగ్గిందని పరిశోధనలో వెల్లడైంది.

ఇవి కూడా చదవండి

గ్రీన్ లైట్ ఏ విధంగా పనిచేస్తుంది..

గ్రీన్ లైట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి పరిశోధకులు వెల్లడించారు. గ్రీన్ లైట్.. మన కళ్ళ నుండి మెదడుకు నరాల ద్వారా ప్రయాణిస్తుంది. వీటిలో కొన్ని నొప్పిని తగ్గించడానికి పని చేస్తాయి. కంటిలోని మెలనోప్సిన్ యాసిడ్, నొప్పిని నియంత్రించడానికి మెదడుకు సంకేతాలను పంపుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..