Health Care: ఈ గింజలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి.. మలబద్దకం నుంచి ఉపశమనం..!

|

May 04, 2022 | 7:42 AM

Health Care: జీవనశైలి సరిగ్గా లేకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. అనేక వ్యాధులు చుట్టుముడుతాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల చాలా మంది ..

Health Care: ఈ గింజలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి.. మలబద్దకం నుంచి ఉపశమనం..!
Follow us on

Health Care: జీవనశైలి సరిగ్గా లేకపోతే అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. అనేక వ్యాధులు చుట్టుముడుతాయి. ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల చాలా మంది మధుమేహం (Diabetes) బారిన పడుతున్నారు. ఈ రోజుల్లో మధుమేహం అనేది సర్వసాధారణమైంది. మరోవైపు శరీరంలో తాగినంత నీటి శాతం, ఫైబర్‌ కంటెంట్‌ లేకపోవడం వల్ల మలబద్ధకం (Constipation) సమస్య వస్తుంది. సకాలంలో వైద్యులను సంప్రదించకపోతే ఇబ్బందిగా మారుతుంది. వాటి ప్రభావాన్ని తగ్గించడానికి, లేదా ఉపశమనం కోసం ఇంటి చిట్కాలు పాటించడం ఎంతో మేలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదంలో చాలా మేలు చేసే చిట్కాలు ఉన్నాయి. షుగర్ వ్యాధిని తొలగించలేము, కానీ దానిని అదుపులో పెట్టుకోవచ్చు.

సబ్జా విత్తనాల ప్రయోజనాలు:

సబ్జా గింజలు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వు , పిండి పదార్ధాలతో సమృద్ధిగా ఉంటాయి. చియా సీడ్స్‌తో పోల్చినట్లయితే, ఇందులో ప్రొటీన్లు ఎక్కువగా ఉన్నాయని, కేలరీలు లేవని నిపుణులు చెబుతున్నారు. మీకు తరచుగా మలబద్ధకం సమస్య ఉంటే సబ్జా గింజలను రోజూ తీసుకోండి. ఇందులో పీచు ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అదనంగా సబ్జా గింజలు కిడ్నీల నుండి ఇన్ఫెక్షన్స్‌ను తొలగించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటాయి.

మధుమేహాన్ని నియంత్రిస్తాయి:

డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు ఈ సబ్జా గింజలతో ఎంతో మేలు ఉంటుంది. సబ్జా గింజలలో మధుమేహాన్ని నియంత్రించే సామర్థ్యం ఉంటుంది. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. ఇవి హై బీపీని కూడా కంట్రోల్‌ చేస్తాయి.

మూత్రం సమస్యను తొలగిస్తుంది:

తక్కువ నీరు త్రాగడం, ఆహారంలో మార్పుల కారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు. హైడ్రేషన్ లోపమే దీనికి ప్రధాన కారణం. యూరిన్ ఇన్ఫెక్షన్ కోసం ఎక్కువ నీరు గడమే కాకుండా, సబ్జా గింజలను కూడా తినండి. ఇది మూత్రంలో ఉన్న ఇన్ఫెక్షన్‌ను తొలగించడం ద్వారా దానిని శుభ్రపరచడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Stress: ఒత్తిడికి గురైనప్పుడు కనిపించే లక్షణాలు.. దీని నుంచి బయట పడటం ఎలా..?

Health Tips: మీ అరచేతులు, అరికాళ్లు ఎక్కువగా చెమటలు పడుతున్నాయా..? హైపర్‌ హైడ్రోసిస్‌ కావచ్చు.. జాగ్రత్త..!