Aloe Vera Juice Benefits: క‌ల‌బంద గుజ్జుతో ఎన్నో లాభాలు.. కీళ్ల నొప్పుల నుంచి దంతాల సంర‌క్ష‌ణ వ‌ర‌కు..

|

Jun 17, 2021 | 6:14 AM

Aloe Vera Juice Benefits: ఎన్నో ర‌కాల ఔష‌ధాల్లో కల‌బంద గుజ్జును వాడ‌తార‌నే విష‌యం తెలిసిందే. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కల‌బంద గుజ్జు దివ్యౌష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే క‌ల‌బంద గుజ్జును నేరుగా తీసుకున్నా..

Aloe Vera Juice Benefits: క‌ల‌బంద గుజ్జుతో ఎన్నో లాభాలు.. కీళ్ల నొప్పుల నుంచి దంతాల సంర‌క్ష‌ణ వ‌ర‌కు..
Aloe Vera Juice Health Benefits
Follow us on

Aloe Vera Juice Benefits: ఎన్నో ర‌కాల ఔష‌ధాల్లో కల‌బంద గుజ్జును వాడ‌తార‌నే విష‌యం తెలిసిందే. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కల‌బంద గుజ్జు దివ్యౌష‌ధంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అయితే క‌ల‌బంద గుజ్జును నేరుగా తీసుకున్నా ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే విష‌యం మీకు తెలుసా? క‌ల‌బంద గుజ్జును తీసుకోవడం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌పై ఓ లుక్కేయండి..

* క‌ల‌బంద‌లో ఉండే శ‌క్తివంత‌మైన అమైనో యాసిడ్‌లు జీర్ణ‌శ‌క్తిని పెంచ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తాయి. శ‌రీరంలో ఉండే వ్యర్థాల‌ను బ‌య‌ట‌కు పంప‌డంలో కూడా క‌ల‌బంద గుజ్జు ఉప‌యోగ‌ప‌డుతుంది.

* రోజుకూ రెండు నుంచి మూడు టీస్పూన్ల మోతాదులో క‌ల‌బంద గుజ్జును తీసుకుంటే పెప్సిన్ అనే ఎంజైమ్ శ‌రీరంలో విడుద‌ల అవుతుంది. ఇది జీర్ణ‌శ‌క్తిని పెంచడంలో కీల‌క పాత్ర పోషిస్తుంది.

* క‌లబంద గుజ్జును ముఖ్యంగా ప‌ర‌గ‌డుపున తీస‌కుంటే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది. దీనివ‌ల్ల శ‌రీరంలో ఉండే విష‌, వ్య‌ర్థ ప‌దార్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి.

* షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తుల‌కు క‌ల‌బంద గుజ్జు దివ్యౌష‌ధంలా ప‌ని చేస్తుంది. దీనివ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. దంతాలు, చిగుళ్ల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న వారు క‌ల‌బంద‌ను నిత్యం తీసుకుంటే మంచి ఫలితం ల‌భిస్తుంది.

* క‌ల‌బంద గుజ్జును తీసుకుంటే.. కీళ్లు దృఢంగా మారుతాయి. కీళ్ల నొప్ప‌లు త‌గ్గుతాయి. శ‌రీరానికి కావాల్సిన విట‌మిన్లు పుష్క‌లంగా ల‌భిస్తాయి.

* ఇక క‌ల‌బంద గాయ‌లు, పుండ్ల‌ను త‌గ్గించ‌డంలోనూ కీల‌క పాత్ర పోషిస్తాయి. గుజ్జును గాల‌యలై రాస్తే త్వ‌ర‌గా త‌గ్గుతుంది.

* త‌ర‌చూ విరేచ‌నాల సమ‌స్య‌తో బాధ‌డేవారు క్ర‌మం త‌ప్ప‌కుండా క‌ల‌బంద గుజ్జును తీసుకుంట‌నే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

గ‌మ‌నిక‌..

ఇదిలా ఉంటే క‌ల‌బంద‌ను తీసుకునే విష‌యంలో కొన్ని జాగ్ర‌త్త‌లు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా కొంద‌రిలో ఈ గుజ్జు అల‌ర్జీని క‌లిగించే ప్ర‌మాదం ఉంటుంది. అంతేకాకుండా గ‌ర్భిణీలు, పిల్ల‌ల‌కు పాలిచ్చే త‌ల్లులు వైద్యుల సూచ‌న‌మేర‌కే క‌ల‌బంద‌ను తీసుకోవ‌డం ఉత్త‌మం.

Also Read: Healthy Tips: కోవిడ్ 19, ఎలర్జీ మధ్య తేడాలివే.? కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవే..

Music at sleep: పాటలు వింటూ నిద్రపోవడం అలవాటా? ఇకపై మీ అలవాటు మార్చుకోండి.. ఎందుకంటే..?

Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..