Tumeric Milk: పసుపు పాలు తాగుతున్నారా? అయితే ఈ ఒక్క పొరపాటు అస్సలు చేయకండి..

ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అయితే కర్కుమిన్‌కు ఒక బలహీనత ఉంది. ఇది మన రక్తంలో అంత సులభంగా కలిసిపోదు. మనం పసుపును కేవలం పాలతో కలిపి తాగితే అందులోని కర్కుమిన్ శరీరానికి పూర్తిగా అందదు. పసుపు పాలు తయారు చేసేటప్పుడు అందులో చిటికెడు మిరియాల పొడి తప్పనిసరిగా వేయాలి.

Tumeric Milk: పసుపు పాలు తాగుతున్నారా? అయితే ఈ ఒక్క పొరపాటు అస్సలు చేయకండి..
Tumeric Milk

Edited By:

Updated on: Feb 03, 2026 | 1:01 PM

భారతీయ ఇళ్లలో రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగడం అనేది ఒక ఆచారం. జలుబు చేసినా, ఒళ్లు నొప్పులుగా ఉన్నా, రోగనిరోధక శక్తి పెంచుకోవాలన్నా మనకు గుర్తొచ్చే మొదటి చిట్కా ఇదే. అయితే మనలో చాలామంది పసుపు పాలు తయారు చేసేటప్పుడు ఒక కీలకమైన పొరపాటు చేస్తున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఒక్క తప్పు వల్ల పసుపులోని గుణాలు శరీరానికి అందకుండా పోతున్నాయి. పసుపులో కర్కుమిన్ అనే అద్భుతమైన పదార్థం ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. అయితే కర్కుమిన్‌కు ఒక బలహీనత ఉంది. ఇది మన రక్తంలో అంత సులభంగా కలిసిపోదు. మనం పసుపును కేవలం పాలతో కలిపి తాగితే అందులోని కర్కుమిన్ శరీరానికి పూర్తిగా అందదు. పసుపు పాలు తయారు చేసేటప్పుడు అందులో చిటికెడు మిరియాల పొడి తప్పనిసరిగా వేయాలి. మిరియాల్లో పైపెరిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది పసుపులోని కర్కుమిన్‌ను శరీరం గ్రహించే శక్తిని ఏకంగా 2,000% పెంచుతుంది. అంటే మీరు మిరియాలు వేయకుండా పసుపు పాలు తాగితే, మీరు ఆశించిన ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందవు.

కర్కుమిన్ కొవ్వులో కరుగుతుంది. కాబట్టి పాలలో చిటికెడు నెయ్యి లేదా కొబ్బరి నూనె వేస్తే అది వేగంగా శరీరానికి అందుతుంది. తెల్ల చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పసుపు పాలలో సహజమైన తీపి కోసం బెల్లం లేదా తేనె వాడటం మంచిది. ప్యాకెట్ పసుపు కంటే పసుపు కొమ్ములను దంచి వాడితే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. రాత్రి పూట పసుపు పాలు తాగడం వల్ల ఒత్తిడి తగ్గి గాఢ నిద్ర పడుతుంది. కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. పసుపు పాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. పసుపు పాలు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. అతిగా తాగడం వల్ల వేడి చేసే అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీలు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకోవడం ఉత్తమం.