Mushroom: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఇవి తింటే ఆ రోగాలనుంచి రక్షణ ఉంటుందట..

మన ఆరోగ్యాన్నికాపాడుకోవడానికి పుట్టగొడుగులు చాలా సాయం చేస్తాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. కాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు.

Mushroom: పుట్టగొడుగులతో పుట్టెడు లాభాలు.. ఇవి తింటే ఆ రోగాలనుంచి రక్షణ ఉంటుందట..
Mushrooms

Edited By: Anil kumar poka

Updated on: Feb 02, 2022 | 8:55 AM

Mushroom: మన ఆరోగ్యాన్నికాపాడుకోవడానికి పుట్టగొడుగులు చాలా సాయం చేస్తాయి. ఇవి ఫంగీ జాతికి చెందిన మొక్కలు. మష్రూమ్స్‌లో ఎన్నోరకాల పోషక విలువలు ఉన్నాయి. కాన్సర్, డయాబెటిస్, ఊబకాయం, గుండె సంబంధ రుగ్మతలు ఉన్నవారు వీటిని తీసుకోవడం మంచి ఫలితాలు పొందుతారు. పోర్టొబెల్లో, క్రెమిని రకాల పుట్టగొడుగుల్లో… ఇర్గోథియోనైన్‌, బటన్‌ రకాలలో సెలీనియం ఎక్కువగా ఉంటాయట. అలాగే మరికొన్ని రకాల మష్రూమ్స్  విటమిన్‌ ‘D’ ఉత్పత్తికి సహకరిస్తాయట. అదేవిధంగా మష్రూమ్స్‌లో క్యాలరీలు తక్కువ గా ఉంటాయి.. ప్రోటీన్స్  ఎక్కువగా ఉంటాయి.. అందుకనే వెయిట్ లాస్ డైట్‌లో ఎక్కువ మంది దీనిని తీసుకుంటుంటారు.మష్రూమ్స్ లో ఉండే ప్రోటీన్, ఫైబర్ వల్ల ఇవి అరుగుదలకి సహకరిస్తాయి, మెటబాలిజం‌ని రెగ్యులేట్ చేస్తాయి.

మష్రూమ్స్‌లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్, ఎస్సెన్షియల్ న్యూట్రియెంట్స్ ఉంటాయి. మష్రూమ్స్ లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొవ్వు శాతం తక్కువ ఉండటం వల్ల బరువు పెరుగుతామన్న భయమే ఉండదు. ఊబకాయంతో బాధపడేవారికి ఇది సహకరిస్తుంది. పుట్టగొడుగుల్లో ఉండే పొటాషియం.. పక్షవాతం ముప్పునూ అరికట్టేందుకు సాయం చేస్తుంది. మష్రూమ్స్‌లో ఉండే విటమిన్‌-ఈ, సెలీనియం ప్రోస్టేట్‌ కాన్సర్‌ బారిన పడకుండా కాపాడతాయి. వెంట్రుకల పోషణలో కూడా మష్రూమ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే మష్రూమ్స్ లో ఇర్గోథియోనైన్‌ , సెలీనియం అనే రెండు యాంటీ ఆక్సీడెంట్లు ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయ్. అదేవిధంగా మష్రూమ్స్‌లో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్ సీ, డీ, వల్ల ఇమ్యూనిటీ బలంగా ఉంటుంది, బాడీకి కావాల్సిన పోషణ లభిస్తుందట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

TOP 9 ET News: క్రీడాకారుడిగా ఎన్టీఆర్‌ | RRR అడ్వాన్స్‌ బుకింగ్‌ ఎప్పటినుండి అంటే..(వీడియో)

Nithya Menon: బూరె బుగ్గల బాబ్లీ బ్యూటీ నిత్యామీనన్.. నయా ఫొటోస్ అదుర్స్..

Jayaprada: జయప్రద ఇంట తీవ్ర విషాదం.. హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరిన సీనియర్ నటి