Health Care Tips: జీలకర్రలో పలు ఆరోగ్య పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. ముఖ్యంగా గ్యాస్ట్రిక్ సమస్య, తలనొప్పి, వికారం లేదా ఇతర జీర్ణ సమస్యల నుంచి తక్షణ ఉపశమనం అందిస్తాయి. ముఖ్యంగా జీలకర్రలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా ఉంటాయి. జీలకర్రను రాత్రి నానబెట్టి, ఉదయం అదే నీటిలో ఎక్కువ నీరు కలుపుకుని టీలాగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీలకర్రలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. అలాగే జీలకర్రలో ఉండే మెగ్నీషియం, కాల్షియం ఇతర ఖనిజాలతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
వాపును తగ్గిస్తుంది
కాలేయం సమస్యల నుంచి
జీలకర్రను నీటిలో మరిగించి ఆ నీటిని తీసుకోవడం వల్ల కాలేయ సమస్యలు దూరమవుతాయి. ఉదర సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ తదితర జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే ఇది మంచి ఆహారం.
ముడతలు తగ్గేందుకు..
జీలకర్రలో ఉండే విటమిన్-ఇ చర్మం ఆరోగ్యానికి సహకరిస్తుంది. ముఖ్యంగా ముఖంలో ముడతలను మాయం మరిగించిన జీలకర్ర నీటిలో క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్, సెలీనియం తదితర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నీటిని తాగితే ముఖంపై ముడతలు పోతాయి. అలాగే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడుతాయి.
జీర్ణశక్తిని పెంచుతాయి..
జీలకర్రకు జీర్ణశక్తిని పెంచే శక్తి ఉంది. రోజూ జీలకర్ర నీటిని తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు బాధించవు. ఇక ఇందులోని లక్షణాలు కొవ్వును కరిగించడంలో సహాయపడుతాయి. ఇక కాలేయంలో బైల్ యాసిడ్ ఉత్పత్తి ప్రక్రియను బలపరుస్తుంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..