ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని పదార్థలు తప్పకుండా తీసుకోవాలి. అలాంటి వాటిల్లో బెల్లం, నెయ్యి కలిపి తినడం మంచిది. ఈ రెండు పదార్థాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ఐరన్ జింక్ వంటి పోషకాలు ఉంటాయి. అదే విధంగా.. నెయ్యిలో విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి, కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండూ కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మరెంతో మేలు చేస్తుంది. బరువు కూడా తగ్గుతారు. అలాంటి పరిస్థితుల్లో బెల్లం, నెయ్యి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుద్దాం..
1.నెయ్యి, బెల్లంతో కలిపిన మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తరచూ మీరు తలనొప్పితో బాధపడుతుంటే.. జామ ఆకును తీసుకొని, దాన్ని కొద్దిగా నెయ్యితో కలిపి తింటే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. మైగ్రేన్ వంటి సమస్యలను కూడా రాకుండా చేస్తుంది.
2.కడుపులోని అనారోగ్య సమస్యలను దూరం చేయడంలో నెయ్యి, బెల్లం ప్రముఖ పాత్ర వహిస్తాయి. నెయ్యి, బెల్లం కలిపి తినడం వల్ల మలబద్ధక సమస్య తగ్గిపోతుంది. అదే విధంగా కడుపులో నొప్పి, ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
3.చలికాలంలో చాలా మందికి కీళ్ల నొప్పులు ఎక్కువగా బాధపడుతుంటారు. ఇలాంటి నొప్పులతో బాధపడేవారు నెయ్యి, తమలపాకు మిశ్రమంతో పాటు కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు త్వరగా తగ్గుతాయి.
4.శరీరంలో ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉంటే, వ్యక్తికి రక్తహీనత ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్లం, నెయ్యి కలిపి తింటే రక్తహీనత నుంచి విముక్తి పొందుతారు.
5.బెల్లం, నెయ్యి కలిపి తింటే ఎముకలు దృఢంగా మారుతాయి. గోధుమలలో కాల్షియం ఉంటుంది. అదే నెయ్యిలో విటమిన్ కె2 లభిస్తుంది. అలాంటప్పుడు ఈ రెండింటిని ఎక్కువగా తీసుకుంటే ఎముకలు దృఢంగా తయారవుతాయి.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
Read Also.. Benefits Of Tamarind: చింతపండు తింటే బరువు తగ్గుతారానేది నిజమేనా..