Health Tips: వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసా..?

|

Aug 16, 2022 | 9:43 AM

అధిక బరువు, ఈస్ట్ సమస్యలను నియంత్రించడానికి వెల్లుల్లి బాగా సహాయ పడుతుంది. స్త్రీలకు నెలసరి నొప్పి బాధ తప్పుతుంది. ఇంకా వెల్లుల్లితో..

Health Tips: వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలుసా..?
Garlic
Follow us on

Garlic Benefits: వెల్లుల్లి మనకు ప్రకృతి ప్రసాదించిన బహుమతి.. ఎందుకంటే ఇది చాలా పోషకమైనది..వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంటుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. నిత్యం మనం తినే ఆహారంలో ఎక్కువ వెల్లుల్లిని చేర్చుకోవడం ద్వారా కాలానుగుణ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. వెల్లుల్లి శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, డయాబెటిస్‌ను నిర్వహించడంలో పనిచేస్తుంది. ఇక వెల్లుల్లి పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎర్ర రక్త కణాలు జీర్ణమైన వెల్లుల్లి నుండి సమ్మేళనాలను ప్రాసెస్ చేస్తాయి. వాటిని సెల్ మెసెంజర్ హైడ్రోజన్ సల్ఫైడ్ (H2S) గా మారుస్తాయని ఒక కొత్త అధ్యయనం చూపిస్తుంది. ఇది రక్త నాళాలను సడలించి..రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీనిలో బి6, సి విటమిన్లు, ఫైబర్, మాంగనీస్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలున్నాయి. శరీరంలో అదనపు కొవ్వులను తగ్గించడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, క్రిమినాశక లక్షణాలు కూడా వెల్లుల్లిలో సమృద్ధదిగా ఉంటాయి. జలుబు, దగ్గు, కఫం నయం చేయడానికి వెల్లుల్లి రెబ్బలు ఉపయోగపడతాయి. వెల్లుల్లిలోని అల్లిసిన్ అనే సమ్మేళనం గొంతులో ఉండే బ్యాక్టీరియాను చంపుతుంది. వెల్లుల్లిని నేరుగా తిన్నా, కొంచెం కాల్చి తిన్నా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చర్మం, జుట్టు, గోర్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో పాటు రొమ్ము క్యాన్సర్ లాంటి వ్యాధులను నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

అధిక బరువు, ఈస్ట్ సమస్యలను నియంత్రించడానికి వెల్లుల్లి బాగా సహాయ పడుతుంది. స్త్రీలకు నెలసరి నొప్పి బాధ తప్పుతుంది. గర్భాశయం ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక బలహీనతను దూరం చేస్తుంది. పొట్ట శుభ్రంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల ఫిట్‌గా ఉంటారు.శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. జీర్ణశక్తిని పెంచే దివ్యౌషధంగా వెల్లుల్లి పనిచేస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి