Health Benefits: ఆరోగ్యం పై శ్రద్ద ఎవరికీ ఉండదు చెప్పండి.. ఎం తింటే మంచిది.. ఎంత తింటే మంచిది అనేవి లెక్కలేసుకొని మరీ తినాలి అంటున్నారు వైద్యులు. అమితంగా తింటే ప్రమాదం తప్పదంటున్నారు. డ్రై ఫ్రూట్స్ వల్ల మనకు ఎన్నో లాభాలు ఉంటాయి. ముఖ్యంగా వాటిలోని అంజీర్ వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది అంటున్నారు వైద్యులు. అంజీర్ పండ్లు మనకు డ్రై ఫ్రూట్స్ రూపంలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. వీటిని సరిగ్గా తీసుకుంటే చాల రోగాలు మన దరి చేరవట. ఈ క్రమంలోనే అంజీర్ పండ్లను నిద్రపోయే ముందు తీసుకోవడం వల్ల ఎన్నోరకాల ప్రయోజనాలు ఉంటాయట. ముఖ్యంగా అంజీర్ పండ్లలో కాల్షియం ఉండటం వల్ల ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఎముకలు విరిగిన సమయంలో ఈ పండ్లను తింటే ఎంతో మేలు జరుగుతుందట. అలాగే అంజీర్ వల్ల రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఈ పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రక్తం తయారయ్యేలా చేస్తుంది. దాంతో రక్తహీనత దూరమవుతుంది.
ఆస్తమా ఉన్నవారు అంజీర్ పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. శ్వాస సరిగ్గా ఆడుతుంది. అంజీర్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కనుక మలబద్దకం, అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి బయటపడేస్తుందట అంజీర్. ఈ పండ్లలో పొటాషియం, ఇతర మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. కనుక వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల పురుషుల్లో వీర్యం అధికంగా ఉత్పత్తి అవుతుంది. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో ఉండే సమస్యలు తగ్గుతాయి. దీంతో సంతాన లోపం సమస్య నుంచి బయట పడవచ్చు. అధిక బరువు సమస్య తో బాధపడే వారు ఈ పండ్లను రోజూ తింటుంటే బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ పండు శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అంజీర్ పండ్లను రాత్రి పూట నీటిలో మూడు- నాలుగు నానబెట్టి మరుసటి రోజు పరగడుపునే తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. లేదా రాత్రి పూట మూడు- నాలుగు అంజీర్ పండ్లను నేరుగా తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగవచ్చు. అంతే కాదు నిద్ర కూడా హాయిగా పడుతుంది అంటున్నారు నిపుణులు.
మరిన్ని ఇక్కడ చదవండి :