Health Benefits: దాల్చిన చెక్కతో వాటన్నింటికి చెక్ పెట్టవచ్చా?

|

Jul 26, 2023 | 12:23 PM

వంటిల్లు వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. ఆడవారు వంట గదిలో ఉపయోగించే వాటితో ఎన్నో వ్యాధులకు, సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాస్త శ్రద్ధ తీసుకుని.. రోజూ వాడటం వల్ల సమస్యలకు దూరంగా ఉంటాం. వంటింట్లో మనకు అద్భుతంగా ఉపయోగించే పదార్థం..

Health Benefits: దాల్చిన చెక్కతో వాటన్నింటికి చెక్ పెట్టవచ్చా?
Cinnamon Benefits
Follow us on

వంటిల్లు వైద్య శాల అని ఊరికే అనలేదు పెద్దలు. ఆడవారు వంట గదిలో ఉపయోగించే వాటితో ఎన్నో వ్యాధులకు, సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కాస్త శ్రద్ధ తీసుకుని.. రోజూ వాడటం వల్ల సమస్యలకు దూరంగా ఉంటాం. వంటింట్లో మనకు అద్భుతంగా ఉపయోగించే పదార్థం.. ‘దాల్చిన చెక్క’. దీన్ని మనం ఎక్కువగా పలవ, బిర్యాని, మసాల వాటిల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. అయితే ఈ దాల్చిన చెక్కను ఇలా కూడా వాడితే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ కి బైబై చెప్పవచ్చు. మరి దీన్ని ఎలా వాడాలో తెలుసుకుందామా.

-ప్రస్తుతం అధిక బరువతో చాలా మంది బాధపడుతున్నారు. జీవనశౌలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు మారడం, నిద్రలేమి, పని ఒత్తిడి, టెన్షన్ కు గురవ్వడంతో శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. దీని వల్ల డయాబెటీస్, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.

-దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ ఫ్లమేటరీ గుణాలు అనేక సమస్యలను దూరం చేస్తాయి. దాల్చిన చెక్క వేడి రుచిని కలిగి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

-మన ఆహారంలోకి దాల్చిన చెక్కను చేర్చుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు త్వరగా కరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పొట్టలోని చెడు బ్యాక్టీరియాను తొలగించి.. మనం తీసుకున్న ఆహారాన్ని సాఫీగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.

– రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దాల్చిన చెక్క మన ఆహారంలో చేర్చుకుంటే.. శరీరంలో ఇన్సులిన్ ప్రభావం చేరి.. రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

-దాల్చిన చెక్క పొడిని స్కూతీ, జ్యూస్ లలో వేసుకున్నా మంచిదే.

-దాల్చిన చెక్కలో ఉండే క్రోమియం ఆకలిని అదుపులో ఉంచుతుంది. శరీరంలో గ్లూకోజ్ స్థాయిల్ని న్యూట్రల్ చేసి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.

-అయితే దాల్చిన చెక్కను ఎక్కువగా వాడకూడదు. దీన్నితక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఎక్కువగా తీసుకుంటూ శరీరానికి వేడి చేస్తుంది. వేసవిలో దీన్ని వాడకపోవడమే బెటర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి