Health Benefits Of Amla and Honey: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. రోజు సమయానికి తిని.. ఆ తిన్నది అరిగే వరకూ కష్టపడి పనిచేస్తే ఏ వ్యాధులు మనదరిచేరవు అంటారు. అంతేకాదు.. ఈ కాలంలో వచ్చే పండ్లు, కూరగాయలు ఆ సీజన్ లో తింటే సగానికి పైగా రోగాలకు దూరంగా ఉంటాం.. ఇక తేనె మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన వరంగా చెప్పుకోవచ్చు. తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక గుణములు , ఔషధగుణములు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగించే ఈ తేనే ఇప్పుడు రోజు తినే ఆహార పదార్ధాలలో ఒకటిగా మారిపోయింది. అయితే
తేనే ను సీజన్ లో దొరికే ఉసిరి కాయలను కలిపి తింటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని ఎన్నో అనారోగ్యాలను దూరం చేసుకోవచ్చని పెద్దలు చెప్పారు. అసలు తేనెను, ఉసిరికాయలను కలిపి ఎలా తినాలో, ఆ మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలి.. దానిని తినడం వల్ల కలిగే ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక జార్ తీసుకుని అందులో సగం వరకు తేనెతో నింపాలి. దాంట్లో బాగా కడిగి నీడలో ఆరబెట్టిన ఉసిరికాయలను వేయాలి. అనంతరం మూత బిగించి పక్కకు పెట్టాలి. కొద్ది రోజులకు ఉసిరికాయలు పండ్ల జామ్‌లా మారుతాయి. అనంతరం వాటిని తీసి రోజుకొకటి చొప్పున అదే జార్‌లోని తేనెతో కలిపి ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. దీంతో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ మిశ్రమాన్ని రోజు రెగ్యులర్ గా తీసుకుంటే లివర్ సమస్యలన్నీ దూరమవుతాయి. లివర్ ఆరోగ్యం మెరుగు పడుతుంది. జాండిస్ వంటి వ్యాధులు ఉంటే అవి త్వరగా నయం అవుతాయి. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో లివర్ మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఇక వయస్సు మీద పడడం వల్ల చర్మం ముడతలుగా తయారవుతుంటుంది. అయితే పైన చెప్పిన తేనె, ఉసిరి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటుంటే దాంతో ఆ ముడతలు తగ్గిపోతాయి. దీని వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కాంతివంతంగా కూడా మారుతుంది.
చలి కాలంలో వేధించే ఆస్తమాకు ఈ ఉసిరి తేనే మురబ్బా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ చలి కాలంలో ఆస్తమా అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. సరిగ్గా శ్వాస కూడా తీసుకోలేరు. అయితే ఈ మిశ్రమాన్ని రోజు తీసుకుంటే ఆస్తమా నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాస కోశ సమస్యలను నివారిస్తుంది.
అంతేకాదు దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్లకు దివ్య ఔషధిగా పనిచేస్తుంది. తేనెలో సహజ సిద్ధమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు, ఉసిరిలో యాంటీ బయోటిక్ గుణాలు కలిసి వైరస్‌లు, బాక్టీరియాలపై సమర్థవంతంగా పోరాటం చేస్తుంది. ఈ క్రమంలో చలికాలంలో మనకు కలిగే దగ్గు, జలుబు, గొంతు ఇన్‌ఫెక్షన్ వంటి వ్యాధులు నయమవుతాయి.
శీతాకాలంలో ఎక్కువగా జీర్ణ శక్తి తక్కువగా ఉండి తిన్నది అరగక అనేక ఇబ్బందులు పడతారు. ఈ మిశ్రమాన్ని తీసుకుంటే అజీర్ణ సమస్య ఉండదు. తిన్న ఆహారం తేలికగా జీర్ణమవుతుంది. అంతేకాదు గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు దూరమవుతాయి. ఆకలి మందగించిన వారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఆకలి పెరుగుతుంది. అంతేకాదు, మలబద్దకం, పైల్స్ వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. రక్తం శుద్ధి అవుతుంది. దీంతో గుండె జబ్బులు నివారింపబడతాయి.
ప్రస్తుతం కాలంలో వేగంగా తీసే పరుగులు.. తినడానికి దొరకని సమయం.. దీంతో ఊబకాయం సర్వసాధారణమైపోయింది. అయితే ఈ తేనె, ఉసిరి మిశ్రమం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. దీని వల్ల అధికంగా ఉన్న బరువు తగ్గుతారు. ఇది స్థూలకాయం ఉన్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది. స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు తగ్గుతాయి. దీని వల్ల రుతుక్రమం సరిగ్గా అవుతుంది. పిల్లలు కలిగేందుకు అవకాశాలు పెరుగుతాయి. అదే మగవారిలో అయితే వీర్య నాణ్యత పెరుగుతుంది. లైంగిక పటుత్వం కలుగుతుంది. తేనె, ఉసిరి మిశ్రమాన్ని సేవిస్తే వెంట్రుకలు కూడా సంరక్షింపబడతాయి. జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరుగుతుంది. ప్రకాశవంతంగా కూడా మారుతుంది.
శరీరానికి ఎన్నో విధాలుగా మేలు చేసే ఈ తేనే ఉసిరి మిశ్రమాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. పిల్లలు పెద్దలు రోజు తినవచ్చు.. మనకు ప్రక్రుతి ప్రసాదించిన పదార్ధాల్లోనే ఎన్నో ఆరోగ్యకరమైన గుణాలున్నాయి.
Also Read: ఓవైపు కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం పరుగులు పెడుతున్న దేశాలు.. మరో వైపు షాకింగ్ న్యూస్ చెప్పిన WHO