Health Benefits: రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు… పుష్కలంగా విటమిన్స్‌

| Edited By: Ram Naramaneni

Apr 15, 2021 | 8:57 AM

Health Benefits: మన ఆహార అలవాట్లపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. చాలా మంది రకరకాలుగా డైట్లు ఫాలో అవుతుంటారు...

Health Benefits: రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యంగా ఉండవచ్చు... పుష్కలంగా విటమిన్స్‌
Health Benefits
Follow us on

Health Benefits: మన ఆహార అలవాట్లపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. చాలా మంది రకరకాలుగా డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందు కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కానీ ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే మన ఆరోగ్యాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. అనారోగ్యానికి గురి కాకుండా ఉండవచ్చు. మనం తినే ఆహరం బట్టి రోగాల బారిన పడకుండా ఉంటామని, ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే ఎంతో మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

పెరుగు

పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతి రోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడుతుంది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాల్షియంతో పాటు విట‌మిన్ బీ2, విట‌మిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగు పర్చడంలో ఎంతగానో సహాయపడతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడంతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

పప్పు దినుసులు

మన తరచూ తినే పప్పుల్లో కూడా విటమిన్స్‌ పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పప్పు దినుసుల్లో ఫైబర్‌, ప్రోటీన్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను సక్రమంగా పని చేసేలా ఉపయోగపడతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి కావడంలో సహాయపడతాయి. పప్పు దినుసుల్లో విటమిన్‌ ఏ, విటమిన్‌ బీ, విటమిన్‌ సీ, విటమిన్‌ ఈ, మెగ్నిషియం, ఐరన్‌, జింక్‌ కూడా లభిస్తాయి.

రాగులు, జొన్నలు, సజ్జలు

మన పెద్దవాళ్లు ఒకప్పుడు రాగి, జొన్నలు, సజ్జలు ఎక్కువగా తినేవాళ్లు. అందుకే వారు ఎంతో ఆరోగ్యంగా జీవించారు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, పంటలు పండిస్తున్న విధానం వల్ల ఆనారోగ్యానికి గురవుతుంటారు. ఈ మిల్లెట్లలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ఇవి ఎంతగానో సహాయ పడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఆహారం.

మ‌సాలా దినుసులు

మన వంటింట్లో మసాల దినుసులు ఉండటం తప్పనిసరి. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వివిధ రకాల నొప్పుల నివారణ, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. గాయాలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు రోగ నిరోధక శక్తిని పెంచడంతో ఎంతో ఉపయోగపడతాయి.

ఇవీ కూాడా చదవండి: ఏడు రోజుల్లో ఏడు కిలోల బరువు తగ్గవచ్చు..! కేవలం కీరదోస తింటే చాలు.. ఎలాగో తెలుసుకోండి..?

కరోనాపై మరికొన్ని రోజులు అప్రమత్తత అవసరం..! వైద్యాధికారుల సమీక్షలో మంత్రి ఈటల..