Hair Care Tips: ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. జుట్టు జిడ్డుగా ఉండదు!

జుట్టు జిడ్డుగా ఉంటే అస్సలు నచ్చదు. జడ వేసుకోవడానికి, బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనకు రెట్టింపు అందాన్ని ఇచ్చేదే జుట్టు. హెయిర్ ఎప్పుడూ అందంగా, సిల్కీగా ఉండాలని కోరుకోని వారుండరు. జుట్టు జిడ్డుగా ఉండటం వల్ల, చుండ్రు వంటి కారణాల వల్ల మొటిమలు, స్కిన్ కూడా జిడ్డుగా మారుతుంది. ఇప్పుడున్న కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా ఈ సమస్య అనేది ఎదురవుతుంది. కొన్ని రకాల ఆహారపు..

Hair Care Tips: ఈ సింపుల్ టిప్స్ పాటించండి.. జుట్టు జిడ్డుగా ఉండదు!
Hair Tips

Edited By: Ram Naramaneni

Updated on: Oct 19, 2023 | 10:20 PM

జుట్టు జిడ్డుగా ఉంటే అస్సలు నచ్చదు. జడ వేసుకోవడానికి, బయటకు వెళ్లడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనకు రెట్టింపు అందాన్ని ఇచ్చేదే జుట్టు. హెయిర్ ఎప్పుడూ అందంగా, సిల్కీగా ఉండాలని కోరుకోని వారుండరు. జుట్టు జిడ్డుగా ఉండటం వల్ల, చుండ్రు వంటి కారణాల వల్ల మొటిమలు, స్కిన్ కూడా జిడ్డుగా మారుతుంది. ఇప్పుడున్న కాలుష్యం, ఆహారపు అలవాట్ల కారణంగా కూడా ఈ సమస్య అనేది ఎదురవుతుంది. కొన్ని రకాల ఆహారపు పదార్థాలను తీసుకుంటే జుట్టును అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అలాగే ఈ రకాల టిప్స్ పాటించడం వల్ల ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

షాంపూ:

షాంపూ వల్ల జిడ్డును తొలగించుకోవడమే కాదు.. జిడ్డు కూడా వస్తుంది. తలస్నానం చేసేటప్పుడు షాంపూను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా హెయిర్ అనేది జిడ్డుగా మారుతుంది. దీని వల్ల జట్టు కూడా చిట్లుతుంది. అందుకే షాంపూ తక్కువగా తీసుకోండి. అలాగే జుట్టును నేచురల్ గా ఆరనివ్వాలి. దీని వల్ల జిడ్డు సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

చుండ్రు:

జుట్టు జిడ్డుగా ఉండటానికి మరో కారణం చుండ్రు అని చెప్పవచ్చు. చుండ్రు ఎక్కువగా ఉండటం వల్ల జిడ్డుగా అనిపిస్తుంది. కాబట్టి ముందు చుండ్రు సమస్యను తగ్గించుకోండి.

దువ్వడం:

చాలా మంది జుట్టు రాలిపోతుందని ఉదయం లేదా సాయంత్రం ఒక్కసారే దువ్వుతారు. కానీ ఇలా చేయడం చాలా తప్పని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జుట్టును ఉదయం, సాయంత్రం, రాత్రి దువ్వడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇలా చేయడం వల్ల జుట్టు జిడ్డు సమస్య కూడా తగ్గుతుంది.

బియ్యం నీరు:

బియ్యం నీరు కూడా జుట్టు జిడ్డును తగ్గించడమే కాకుండా బల పరుస్తుంది. బియ్యం నీటిని కుదుళ్లకు బాగా పట్టించాలి. అరగంట సేపు తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో క్లీన్ చేసుకోవాలి.

టీట్రీ ఆయిల్:

టీట్రీ ఆయిల్ ను ఉపయోగించినా జిడ్డు సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే జుట్టూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. 30 మిల్లీ మీటర్ల కొబ్బరి నూనెలో 10 చుక్కల టీట్రీ ఆయిల్ ను కలిపి.. తలకు రాసుకుని బాగా మర్దనా చేసుకోవాలి. ఒక గంట సేపు ఇలా రాసుకున్న తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా, దృఢంగా ఉండటమే కాకుండా జిడ్డు కూడా తగ్గుతుంది.

ఎక్కువ రోజులు నూనె రాసుకోకూడదు:

చాలా మంది తలకు హెయిర్ ఆయిల్ రాసి రెండు, మూడు రోజులు అలానే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల స్కాల్ఫ్ పైకి మట్టి చేరి.. చుండ్రు ఏర్పడే సమస్యకు దారి తీస్తుంది. కాబట్టి తలకు ఒక్క రోజు కంటే ఎక్కువ రోజులు నూనె రాసి అలానే వదిలేయకూడదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.