Hair Growth Tips: డైలీ జుట్టు రాలిపోతుందా..? ఈ ఫుడ్ తీసుకుంటే వత్తయిన జుట్టు మీ సొంతం

|

Mar 07, 2023 | 4:45 PM

కేవలం పొల్యూషన్ మాత్రమే కాదు ఆహార అలవాట్ల వల్ల కూడా జుట్టు రాలిపోతుందని మీకు తెలుసా? నిజమే మనం డైలీ తినే ఆహారం వల్ల జుట్టుకు అవసరమయ్యే పోషకాలు తగ్గి రాలిపోయే అవకాశం ఉంది. జుట్టు రాలడం అనేది చాలా ఇతర సమస్యల వల్ల కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు.

Hair Growth Tips: డైలీ జుట్టు రాలిపోతుందా..? ఈ ఫుడ్ తీసుకుంటే వత్తయిన జుట్టు మీ సొంతం
Follow us on

కొప్పు చూడు కొప్పు అందం చూడు అనే పాటకు తగినట్లు మహిళలకు జుట్టే ఆకర్షణ. కానీ ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం వల్ల మొదట జుట్టుపైనే ప్రభావం పడుతుంది. క్రమేపీ జుట్టు రాలిపోవడం అనేది రోటీన్‌గా మారుతుంది. కేవలం పొల్యూషన్ మాత్రమే కాదు ఆహార అలవాట్ల వల్ల కూడా జుట్టు రాలిపోతుందని మీకు తెలుసా? నిజమే మనం డైలీ తినే ఆహారం వల్ల జుట్టుకు అవసరమయ్యే పోషకాలు తగ్గి రాలిపోయే అవకాశం ఉంది. జుట్టు రాలడం అనేది చాలా ఇతర సమస్యల వల్ల కూడా కావచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శరీరానికి అవసరమయ్యే పోషకాహారాన్ని అందిస్తే జుట్టు సమస్యలు తగ్గడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగవుతుందని పేర్కొంటున్నారు. జుట్టు రక్షణకు నిపుణులు సూచించే ఆ ఆహారం ఏంటో ఓ సారి తెలుసకుందాం.

జుట్టు రక్షణకు ఇలా చేస్తే మేలు

  • ఉసిరికాయ తీసుకుంటే యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది అకాల గ్రేయింగ్‌తో పాటు చుండ్రును కూడా నివారిస్తాయి.
  • కరివేపాకులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. జుట్టు డ్యామేజ్‌ను రివర్స్ చేస్తుంది. ఉదయానే పరగడపుతో ఓ కరివేపాకులు రెబ్బను తింటే మంచిది.
  • బాదం పప్పు డైలీ తిన్నా జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ఒమేగా-3, ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ -ఈ, బయోటిన్ సమృద్ధిగా ఉంటుంది.  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఉదయాన్నే లేవగానే ఐదు బాదంపప్పు తింటే మంచిది.
  • మునగాకులో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మునగాకు తగినంతగా తింటే ఫోలికల్ డ్యామెజ్‌ను నివారిస్తుంది. 
  • వేరుశెనగల్లో మిటమిన్-ఈ, జింక్, మెగ్నీషియం, బయోటిన్ వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. డైలీ టిఫిన్‌లో వీటిని జోడించడం ఉత్తమం.
  • ప్రతిరోజూ నువ్వులు, జీలకర్ర కలిపి తీసుకుంటే జుట్టు రక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది. నువ్వుల్లో కాల్షియం, మాంగనీస్ వంటివి ఎక్కువగా ఉంటాయి. జీలకర్ర వాటిని సంగ్రహించడంలో సాయం చేస్తుంది. అలాగే ఇతర హార్మోన్లను సంగ్రహించడంలో సాయం చేస్తుంది. 
  • యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు త్రిఫల్ చూర్ణంలో అధికంగా ఉంటాయి. ఇది జుట్టుపెరుగుదలకు చాలా బాగా పని చేస్తుంది. పడుకునే 30 నిమిషాల ముందు త్రిఫల చూర్ణంతో చేసిన టీను తాగడం ఉత్తమం.
  • ఆలివ్ విత్తనంలో కాల్షియం, ఐరన్లు, విటమిన్లు ఏ,సీ,ఈలు అధికంగా ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి డైలీ ఆహారంలో వాటిని తీసుకోవడం కూడా చాలా మంచిది.
  • మెంతిగింజల్లో పెట్రో ఈస్ట్రజన్ అధికంగా ఉంటుంది. వీటిని డైలీ నానబెట్టి తినడం వల్ల జుట్టు డ్యామేజ్‌ను కవర్ చేస్తుంది. అలాగే జుట్టు జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. 
  • దోసకాయలో సిలికాన్ సల్ఫర్ ఎక్కువగా ఉంటాయి. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడమే కాక ఆర్ద్రీకరణకు సాయం చేస్తుంది. 
  • వెల్లుల్లిలో సెలీనియం, సల్ఫర్ ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అలాగే జట్టు పోషణలో సహాయపడుతుంది. వెల్లుల్లి విటమిన్-సి అధికంగా ఉంటుంది. ఇది జట్టు పెరుగుదలకు అవసరమయ్యే కొల్లాజెన్ ఏర్పడటాన్ని పెంచుతుంది.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..