Tomatoes: పచ్చిగా ఉందని పక్కనబెట్టకండి.. నివ్వెరపరిచే ఆరోగ్య ప్రయోజనాలు

|

Jun 15, 2024 | 3:58 PM

పచ్చి టమాటల్లో పుష్కలంగా ఉండే లైకోపీన్, విటమిన్స్ సి, ఎ, ఇ.. వంటివి చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు. అలాగే.. వీటిలో ఉండే పోషకాలు ఎముకలను బలంగా తయారవ్వడంలో చాలా బాగా ఉపయోగపడతాయంటున్నారు.

Tomatoes: పచ్చిగా ఉందని పక్కనబెట్టకండి.. నివ్వెరపరిచే ఆరోగ్య ప్రయోజనాలు
Raw Tomatoes
Follow us on

టామాట.. ప్రతి వంటింట్లోనూ అతి ముఖ్యమైన కూరగాయ. టమోటాలు లేకుండా ఏ కూర పూర్తి కాదు. టొమాటో ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సాధారణంగా ఎర్రటి టమాటాను సాంబారు, పులుసు, చట్నీలకు ఉపయోగిస్తారు. అయితే పచ్చి టొమాటోలో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా?. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. పచ్చి టొమాటోల్లో క్యాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. విటమిన్లు A, C,  ఫైటోకెమికల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి.

  • గ్రీన్ టొమాటోలో విటమిన్ కె, కాల్షియం, లైకోపీన్ మెండుగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ పచ్చి టొమాటోలను చిన్న పిల్లలకు నిత్యం తినిపిస్తే వారు స్ట్రాంగ్‌గా ఎదుగుతారు
  • పచ్చి టమోటోలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదనంగా, ఐ ఫోకస్ మెరుగుపడుతుంది. అలాగే, వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మానికి పోషణనిస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • పచ్చి టొమాటోల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు పచ్చి టమోటాలు తింటే మెరుగైన రిలీఫ్ ఉంటుంది. అలాగే వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది సీజనల్ వ్యాధులను నివారిస్తుంది.
  • పచ్చి టమాటలు తినడం వల్ల టైప్ -2 డయాబెటిస్ బాధితులు మంచి ఫలితాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వీటిలో ఉండే లైకోపిన్, ఫైబర్.. వంటి పోషకాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, కణజాల నష్టాన్ని నివారించడంలో, మంటను తగ్గించడంలో, సహాయపడతాయని పరిశోధనలు సూచిస్తున్నాయి.

 పచ్చి టమాటాలు పుల్లపుల్లగా బానే ఉంటాయి. కాబట్టి, వీటిని చిన్న పీసులుగా కట్ చేసుకుని  సలాడ్ వంటి వాటిల్లో మిక్స్ చేసి తినవచ్చు. కూరల్లో, స్మూతీస్, సూప్స్, వంటి వాటిల్లో యాడ్ చేసుకొని ఎంజాయ్ చేయవచ్చు. లేదంటే నేరుగా కాస్త ఉప్పు, కారం చల్లుకొని కూడా లాగించొచ్చు

( ఈ సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత డాక్టర్ల సలహాలు తీసుకోండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..