భారతదేశంలో చలికాలం వచ్చేసింది. ఇది మటర్(పచ్చి బఠానీ) సీజన్. పప్పుదినుసుల కుటుంబానికి చెందిన చిన్నని ఆకుపచ్చ గింజలు. దీపావళి పండుగ నుంచి మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి. ప్రజలు వీటితో రుచికరమైన కూరలు, స్నాక్స్, మరెన్నో వంటకాలను తయారు చేస్తుంటారు. మటర్ పనీర్, ఆలూ మటర్, మటర్-స్టఫ్డ్ పూరీ, మటర్ పులావ్, మటర్ పరాటా,బఠానీల సూప్ నుండి చూడా మాటర్ వరకు ఎన్నో వెరైటీ వంటకాలు ఉన్నాయి. ఇకపోతే, బఠాణీలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పచ్చిబఠాణి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.. గ్రీన్ పీస్ ను మీ డైట్ లో భాగంగా చేసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. ప్రతిరోజు పచ్చి బటాని తినడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
మటర్‌ను సాధారణంగా ఇతర కూరల్లో కలిపి వండుతుంటారు. కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మటర్ చాలా మంచిది. కొలెస్ట్రాల్, మధుమేహం, చర్మ సంరక్షణ, ప్రోటీన్ల లోపం, అజీర్తి వంటి సమస్యలకు మటర్ మంచి పరిష్కారం. మటర్ తినడం వల్ల డయాబెటిస్ రోగులకు ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే మటర్ గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మటర్ బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గిస్తుంది. మటర్‌లో ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకే డయాబెటిస్ మంచిది.
మటర్ అనేది హెచ్ డీఎల్ అంటే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా తినడం వల్ల నాళికల్లో కొలెస్ట్రాల్ బ్లాక్ కాకుండా ఉంటుంది. బ్లాకేజ్ ముప్పు ఉండదు. గుండె ఆరోగ్యానికి మంచిది. మటర్‌లో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఆరోగ్యానికి మేలు కల్గించే న్యూట్రియంట్లు ఉన్నాయి. మటర్‌లో విటమిన్ బి 6, విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చర్మంపై ముడతలు దూరమౌతాయి. ఆర్థరైటిస్ ముప్పు నుంచి కాపాడతాయి. మటర్‌లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నందున ప్రోటీన్ లోపం ఉండేవారిని అధికంగా తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. మటర్ తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మటర్‌లో ఉన్నయాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ జీర్ణక్రియకు దోహదపడతాయి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలు కూడా దూరమౌతాయి.
వీటిలోని ల్యూటిన్, జియాగ్జాంతిన్ అనే కెరోటినాయిడ్స్ కళ్లని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాటరాక్ట్ బారిన పడకుండా కాపాడతాయి. అంతేకాదు కంప్యూటర్, ల్యాప్‌టాప్, ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ కారణంగా కళ్లు దెబ్బతినకుండా చూస్తాయి. ఇందులోని ఒమెగా–3, 6 ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. రక్తనాళాల్లో కొవ్వు, కొలెస్ట్రాల్ చేరకుండా చూస్తాయి. పచ్చి బటానీలోని పొటాషియం, మెగ్నీషియం, హై బీపీని తగ్గిస్తాయి. ఈ బటానీలో సి, ఇ విటమిన్లు, జింక్, కాటెచిన్, ఎపికాటెచిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి