Liver Health: పచ్చి తాగుబోతులూ.. రోజూ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే మీ లివర్ సేఫ్

మన శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లను పొందే ఉత్తమమైన పండ్లలో ద్రాక్ష ఒకటి. క్యాన్సర్ నివారణకు మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన బరువు నియంత్రణను కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. ద్రాక్ష రసంలో విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, ఐరన్, పొటాషియం, కాల్షియం అధిక స్థాయిలో ఉంటాయి. గ్రేప్ జ్యూస్ కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది.

Liver Health: పచ్చి తాగుబోతులూ.. రోజూ ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగితే మీ లివర్ సేఫ్
Liver

Updated on: Jan 24, 2024 | 3:45 PM

కొంతమంది డైలీ లిక్కర్ సేవస్తూ ఉంటారు. సరదాగా అయిన అలవాటు.. బానిసలుగా మార్చేస్తుంది. ఆల్కాహాల్ లేకపోతే వారికి రోజు గడవదు. డాక్టర్లు చెప్పినా వదులుకోలేనంత బలహీన దశకు వెళ్తారు. లిక్కర్ తాగడం వల్ల లివర్ డ్యామేజ్ మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో వాళ్లు వారిని మాన్పించేందుకు అనేక ప్రయత్నాలు చేసి విసిగిపోతూ ఉంటారు. అయినా కానీ నో ఛేంజ్. అలాంటి వారికి రోజుకు 500 మిల్లిలీటర్ల ద్రాక్ష రసం ఇస్తే మంచిదంటున్నారు  ప్రకృతి వైద్యులు మంతెన సత్యనారాయణ రాజు. ఆల్కాహాల్ వల్ల జరిగే డ్యామేజ్‌ను చాలావరకు క్లియర్ చేయగలికే సామర్థ్యం గ్రేప్ జ్యూస్‌కు ఉంటుందంటున్నారు. రోజుకు రెండు మూడు బీర్లు లేదా రెండు క్వార్లర్ల మందు తాగేవారికి మంచి చేసే గ్రేప్ జ్యూస్ ఒక గ్లాస్ తాగడం పెద్ద లెక్క కూడా కాదు. సో మీ కుటుంబ సభ్యుల్లో ఎవర్నైనా తాగుడు మాన్పించలేకపోతే.. రోజుకు ఒక గ్లాస్ గ్రేప్ అయితే తాగేలా చెయ్యండి.

రెండు మూడు రకాల ద్రాక్ష పళ్లు మనకు మార్కట్లో దొరకుతాయి. వాటిలో ఏవైనా తీసుకోవచ్చని మంతెన చెప్పారు. నిరింజిన్, నిరింజినిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ద్రాక్ష రసంలో ఉంటాయట. ఆల్కాహాల్ వల్ల లివర్ సెల్స్‌లో ఇన్‌ఫ్లమేషన్ రాకుండా ఇవి కాపాడతాయి. అలాగే లివర్ సెల్స్ లీక్ అవ్వకుండా కాపాడతాయి. అలానే గ్రేప్ జ్యూస్ వల్ల ఏడీహెచ్ అనే ఎంజెమ్ ఉత్పత్పి శరీరంలో పెరుగుతుంది. ఏడీహెచ్.. ఆల్కాహాల్‌ను త్వరగా విచ్చిన్నం చేసి లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.

మీ ఆహారంలో ద్రాక్ష రసాన్ని చేర్చుకోవడం వల్ల ఈ క్రింది ప్రయోజనాలు ఉన్నాయి:

  • ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ , అలెర్జీలకు చెక్ పెట్టవచ్చు. యాంటి ఏజింగ్ కింద ఉపయోగపడుతుంది
  • జీర్ణ ఆరోగ్యానికి మంచిగా పనిచేస్తుంది
  • తలనొప్పి నుంచి రిలీఫ్ పొందవచ్చు
  • ఎముకల బలాన్ని పెంచడానికి సాయపడుతుంది
  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది
  • రాత్రి పూట మంచిగా నిద్ర పట్టేందుకు ఉపకరిస్తుంది

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.