ఇప్పుడు ఏ వయసువారిని కదిలించినా ఒళ్లు నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అంటుంటారు. ఒకప్పుడు వయసు పైబడిన వారిలో కనిపించే అనారోగ్య సమస్యలు.. ఇప్పుడు యుక్తవయసైనా రాకుండానే వచ్చేస్తున్నాయి. అందుకు కారణాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన తినే ఆహారం, జీవనశైలే కారణం. ఉప్పు లేకపోతే ఏ వంటకూ రుచి ఉండదు. అలాంటి ఉప్పు కూడా ఇప్పుడు కల్తీ అయిపోతుంది. అయోడిన్ ఉన్నది వాడాలో లేనిది వాడాలో కూడా కన్ఫ్యూజనే. మన పెద్దలు కల్లుప్పు (గళ్లు ఉప్పు) వాడేవారు కాబట్టి.. వాళ్లకు నొప్పుల పరంగా ఇబ్బందులు వచ్చేవి కాదు.
*ఇప్పుడు ఒళ్లు నొప్పులు వస్తున్నాయంటే వైద్యులు కూడా.. కొన్నిరకాల ఆయుర్వేద ఉప్పులను వాడాలని సూచిస్తున్నారు. పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్ ఇలా రకరకాల ఉప్పులను తయారు చేస్తున్నారు. సాధారణ ఉప్పు కంటే.. నల్ల ఉప్పును ఆహారంలో తీసుకుంటే మంచిదని నిపుణులు కూడా సూచిస్తున్నారు.
*ఇది ప్రత్యేకంగా విడిగా తీసుకోవాల్సిన పనిలేదు. సాధారణంగా కూరల్లో ఉప్పును ఎలా వేస్తామో.. దానికి బదులు నల్ల ఉప్పును వేస్తే చాలు. ఈ ఉప్పును వాడితే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపుబ్బరం, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలకు బాగా పనిచేస్తుంది.
*కండరాల నొప్పులు, గుండెల్లో మంట, కాలి పిక్కలు పట్టేయడం వంటి సమస్యలను కూడా నల్ల ఉప్పు తగ్గిస్తుంది.
*అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారికి నల్ల ఉప్పు మంచి ఔషధంలా పనిచేస్తుంది. దీనివల్ల రక్తం పలుచబడటంతో పాటు.. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కూడా ఉంటుంది. గుండెజబ్బుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
*నల్ల ఉప్పును రోజూ తీసుకుని ఆహారంలో కలిపి తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గడంతో పాటుగా.. సైనస్, దగ్గు, జలుబు, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది. అంతేకాదు షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి