వామ్మో.. వెల్లుల్లిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే డైరెక్టుగా షెడ్డుకేనట..

వెల్లుల్లిని ఆహార రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి తినడం ద్వారా అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. కానీ వెల్లుల్లిని కొన్ని పదార్థాలతో కలిపి అస్సలు తినకూడదు. వెల్లుల్లిని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

వామ్మో.. వెల్లుల్లిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే డైరెక్టుగా షెడ్డుకేనట..
Garlic

Updated on: May 25, 2025 | 4:08 PM

వెల్లుల్లిని ఆహార రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి తినడం ద్వారా అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. కానీ వెల్లుల్లిని కొన్ని పదార్థాలతో కలిపి అస్సలు తినకూడదు. వెల్లుల్లిని కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని.. ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి వెల్లుల్లిని పోషకాల నిధిగా పిలుస్తారు.. ఇది చాలా శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ.. ఆరోగ్యాన్ని పలు సమస్యల నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి నమిలి తినడం వల్ల అపారమైన ప్రయోజనాలు లభిస్తాయని పేర్కొంటున్నారు. అయితే.. వెల్లుల్లిని ఏ పదార్థాలతో కలిపి తినకూడదు.. నిపుణులు ఏం చెబుతున్నారు..? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

వెల్లుల్లిని వీటితో కలిపి తీసుకోకండి..

రక్తాన్ని పలుచబరిచే మందులు:

వైద్య నిపుణుల ప్రకారం.. మీరు రక్తం పలుచబడే మందులు తీసుకుంటుంటే, వెల్లుల్లి తినకూడదు. ఎందుకంటే వెల్లుల్లి మరియు మందులు తీసుకోవడం వల్ల సమస్య పెరుగుతుంది.

మద్యంతో తీసుకోకూడదు:

వెల్లుల్లిని ఆల్కహాల్ తీసుకునే ముందు లేదా తర్వాత అస్సలు తినకూడదు. వెల్లుల్లి తినడం వల్ల కాలేయంపై చెడు ప్రభావం పడుతుంది. వెల్లుల్లి – ఆల్కహాల్‌లో ఉండే సమ్మేళనాలు కాలేయం, జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. వెల్లుల్లి, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, మంట, యాసిడ్ రిఫ్లక్స్ వస్తాయి.

గ్రీన్ టీ తో వెల్లుల్లిని తీసుకోకూడదు:

వెల్లుల్లిని గ్రీన్ టీ తాగడానికి ముందు లేదా తర్వాత కొంతసేపటి వరకు తినకూడదు. గ్రీన్ టీ – వెల్లుల్లి రెండూ ఆరోగ్యానికి మేలు చేస్తాయి కానీ వాటిని కలిపి తినడం వల్ల మీకు హాని కలుగుతుంది. గ్రీన్ టీలో కెఫిన్ ఉంటుంది. కాబట్టి వెల్లుల్లి తినడం వల్ల కడుపు మంట, ఆమ్లత్వానికి దారి తీస్తుంది..

ఆయుర్వేద వైద్యుడు సలీం జైదీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లుల్లిని ఏ వస్తువులతో తినకూడదో తెలిపే వీడియోను షేర్ చేశారు.

వీడియోను చూడండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..