Health Care: శరీరమంతా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నారా..? కారణం అవేనంట.. ఇలా చెక్ పెట్టండి..

|

Aug 27, 2022 | 1:57 PM

కొన్నిసార్లు మొత్తం శరీరంలో నొప్పికి కారణాలు సాధారణంగా ఉంటాయి. కొన్నిసార్లు అవి తీవ్రంగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో

Health Care: శరీరమంతా తీవ్రమైన నొప్పులతో బాధపడుతున్నారా..? కారణం అవేనంట.. ఇలా చెక్ పెట్టండి..
Pains
Follow us on

Full Body Pain Reason: ఈ రోజుల్లో కొంతమందికి శరీర నొప్పులు సహజమయ్యాయి. చాలా మంది కాళ్లు, చేతులు, నడుము, భుజాలు లేదా మెడలో నొప్పులతో బాధపడుతున్నారు. అయితే కొంత మంది శరీరం మొత్తం నొప్పితో బాధపడుతుంటారు. కొన్నిసార్లు మొత్తం శరీరంలో నొప్పికి కారణాలు సాధారణంగా ఉంటాయి. కొన్నిసార్లు అవి తీవ్రంగా మారుతాయి. అటువంటి పరిస్థితిలో మొత్తం శరీరంలో నొప్పికి కారణం ఏమిటి..? దానికి ఎలాంటి చికిత్స అందించాలి..? అనే విషయాలు మాత్రం చాలామందికి తెలియదు. శరీర నొప్పులతో బాధపడుతుంటే.. ఎలాంటి చికిత్స తీసుకోవాలి.. ఎలా అరికట్టాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

శరీరంలో నొప్పికి కారణాలు..

శ్రమ- ఒత్తిడి: శ్రమ, ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో పదునైన నొప్పి ఉంటుంది. ఒత్తిడికి లోనవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీంతో కండరాలు బిగుతుగా మారతాయి. ఇది మాత్రమే కాదు, దీర్ఘకాలిక ఒత్తిడి కారణంగా శరీర కండరాలలో దీర్ఘకాలంగా నొప్పి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

డీహైడ్రెషన్: డీహైడ్రెషన్ కారణంగా చాలా సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో నీరు లేకపోవడం వల్ల శరీరంలో నొప్పి ఎక్కువ అవుతుంది. ఏదైనా వ్యక్తి శరీరం బాగా చురుకుగా పనిచేయడానికి హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. డీహైడ్రేట్ అయినప్పుడు ఆ వ్యక్తి అలసిపోయినట్లు అనిపిస్తుంది. ఈ కారణంగా శరీరమంతా నొప్పి అనుభూతి చెందుతుంది.

నిద్ర లేకపోవడం: ఆరోగ్యంగా ఉండటానికి తగినంత నిద్ర పొందడం చాలా ముఖ్యం. సరిగా నిద్రపోని వారు తరచుగా నొప్పిని అనుభవిస్తారని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. నిద్ర లేకపోవడం వల్ల శరీరం అలసటగా అనిపించడం మొదలవుతుంది. దీని కారణంగా బద్ధకం, శరీరం బరువుగా అనిపించవచ్చు.

ఆర్థరైటిస్ : కీళ్ళ నొప్పులతో పాటు కండరాల్లో మంటగా ఉంటే.. క్రమంగా ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్‌ వల్ల శరీరం అంతటా తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..