Frozen Shoulder: మీకెప్పుడైనా భుజం కండరాలు పట్టేసి.. విపరీతమైన నొప్పి వచ్చిందా? ఆర్థరైటిస్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే..

ఒక్కోసారి ఉన్నట్లు తీవ్రమైన భుజం నొప్పి వస్తుంటుంది. దీంతో కనీసం పక్కకు కూడా కదలలేని పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి సమస్యలు సాధారణ నొప్పి నివారణ మందులు లేదంటే పెయిన్‌ రిలీఫ్‌ జెల్‌లతో తగ్గవు. దీనిని 'ఫ్రోజెన్ షోల్డర్' అంటారు. వైద్య పరిభాషలో దీనిని 'అడెసివ్ క్యాప్సులిటిస్' అని అంటారు. సాధారణంగా ఈ వ్యాధి మెడ, భుజాల కండరాలు, కీళ్లను ప్రభావితం చేస్తుంది. చేయి, భుజాన్ని కలిపే ఎముకలు, స్నాయువులు..

Frozen Shoulder: మీకెప్పుడైనా భుజం కండరాలు పట్టేసి.. విపరీతమైన నొప్పి వచ్చిందా? ఆర్థరైటిస్ అనుకుంటే తప్పులో కాలేసినట్లే..
Frozen Shoulder

Updated on: Jul 15, 2024 | 7:00 AM

ఒక్కోసారి ఉన్నట్లు తీవ్రమైన భుజం నొప్పి వస్తుంటుంది. దీంతో కనీసం పక్కకు కూడా కదలలేని పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి సమస్యలు సాధారణ నొప్పి నివారణ మందులు లేదంటే పెయిన్‌ రిలీఫ్‌ జెల్‌లతో తగ్గవు. దీనిని ‘ఫ్రోజెన్ షోల్డర్’ అంటారు. వైద్య పరిభాషలో దీనిని ‘అడెసివ్ క్యాప్సులిటిస్’ అని అంటారు. సాధారణంగా ఈ వ్యాధి మెడ, భుజాల కండరాలు, కీళ్లను ప్రభావితం చేస్తుంది. చేయి, భుజాన్ని కలిపే ఎముకలు, స్నాయువులు కణజాలంతో కప్పబడి ఉంటాయి. ఈ కణజాలం వాపు లేదా గట్టిగా మారినప్పుడు బిగుసుకుపోయి భుజం నొప్పి తలెత్తుతుంది.

పురుషులు, మహిళలు అందరికీ ఈ విధమైన సమస్య భుజంలో తలెత్తే అవకాశం ఉంది. అయితే మహిళలు ఎముకల సమస్యలతో ఎక్కువగా బాధపడుతుంటారు. వీరిలో భుజం కండరాలు బిగుసుకుపోయే ప్రమాదం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ సమస్య ప్రధానంగా 40 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో కనిపిస్తుంది. చాలామంది దీనిని ఆర్థరైటిస్ నొప్పి, ఏదైనా గాయం కారణంగా ఈ నొప్పి వచ్చిందని అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. ఫ్రోజెన్ షోల్డర్ సమస్య ఉన్నవారిలో భుజం భాగంలో మాత్రమే నొప్పి ప్రారంభమవుతుంది. ఫలితంగా చేయి కదపడం కష్టం అవుతుంది. చాలా మంది ఈ విధమైన భుజం నొప్పితో బాధపడుతుంటారు.

ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ఎలా వదిలించుకోవాలంటే..

నొప్పి నివారణ మందులు తీసుకోవడం లేదా లేపనాలు వేయడం వల్ల ఫ్రోజెన్ షోల్డర్ సమస్యకు పెద్దగా ప్రయోజనం ఉండదు. అయితే కొన్నాళ్ల తర్వాత ఈ నొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. అయితే, చాలా సార్లు వైద్యులు కూడా స్టెరాయిడ్స్ తీసుకోవాలని సూచిస్తుంటారు. ఇంజెక్షన్లు కూడా ఇస్తారు. వీటితోపాటు వైద్యుల సూచనల మేరకు వ్యాయామాలు కూడా చేస్తే ఫలితం ఉంటుంది. వ్యాయామం చేయడం ద్వారా ఘనీభవించిన భుజం నొప్పిని తగ్గించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.