Measles: తట్టు మళ్లీ తరుముకొస్తోంది.. తస్మాత్‌ జాగ్రత్త..! ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

తట్టు ఒక అంటువ్యాధి. ఇది 'పారామైక్సోవైరస్' అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. తట్టుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ వ్యక్తి లాలాజలం నుంచి వైరస్ గాలిలో కలుస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తికి కూడా ఇది సంక్రమించవచ్చు. తట్టు లక్షణాలు సాధారణంగా రెండవ వారంలో బయటపడతాయి.

Measles: తట్టు మళ్లీ తరుముకొస్తోంది.. తస్మాత్‌ జాగ్రత్త..! ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
Measles
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 23, 2023 | 12:58 PM

మీజిల్స్‌(తట్టు) మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కోవిడ్‌ సంక్షోభం సమయంలో భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు మీజిల్స్‌ టీకాలు వేయడం ఆలస్యం అవడం.. మరికొంత మంది అసలు టీకాలు వేయించకపోవడంతో ఈ వ్యాధి మళ్లీ విజృంభిస్తోంది. భారతదేశంలో కూడా ఈ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం గతేడాది నవంబర్‌ నాటికి 12,773 ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయి.  ఈ క్రమంలో అసలు ఈ వ్యాధి ఏంటి? దీని లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారం వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఇదొక అంటువ్యాధి..

తట్టు ఒక అంటువ్యాధి. ఇది ‘పారామైక్సోవైరస్’ అనే వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. తట్టుతో బాధపడుతున్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ వ్యక్తి లాలాజలం నుంచి వైరస్ గాలిలో కలుస్తుంది. తద్వారా ఆరోగ్యకరమైన వ్యక్తికి కూడా ఇది సంక్రమించవచ్చు. తట్టు లక్షణాలు సాధారణంగా రెండవ వారంలో బయటపడతాయి. తట్టు ఉన్న వ్యక్తిని నేరుగా కలిసినా ఇన్‌ఫెక్షన్ సోకవచ్చు. దీని వల్ల పిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలు, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయిదు నుంచి ఏడు రోజుల తరువాత శరీరంపై ఎర్రటి పొక్కులు కనిపిస్తాయి. కొన్నిసార్లు నోటిలో తెల్లటి మచ్చలు వస్తాయి.

శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి..

మీజిల్స్ లక్షణాలు పసిబిడ్డలకు చాలా అసౌకర్యాన్ని కల్గిస్తాయి. ఈ వ్యాధి సోకినప్పుడు శరీరం డీ హైడ్రేట్‌ కాకుండా కాపాడుకోవాలి. అందుకోసం నీరు, మజ్జిగ ఎక్కువగా తాగాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. విటమిన్ సితో కూడిన నారింజ, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు బొప్పాయిని తినాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి, దద్దుర్లను నివారించడానికి సహాయపడతాయి. అలాగే ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే గుడ్లు, బ్రోకలీ, బచ్చలికూర, ముదురు ఆకుపచ్చ ఆకు కూరలను చేర్చాలి. వెల్లుల్లి, కరివేపాకులను సూప్‌లలో చేర్చాలి. కొబ్బరి నీరు తాగాలి. పసుపు పాలను కూడా తాగవచ్చు. పసుపులో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి దద్దుర్లు నిర్వహించడానికి సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

ద్రవ ఆహారాలకు ప్రాధాన్యం..

లక్షణాలు గుర్తించినప్పుడు రోగికి ద్రవ పదార్థాలు ఎక్కువగా ఇచ్చేందుకు ప్రయత్నించాలి. జ్వరం ఉంటుంది కాబట్టి కొంతమందికి అరుగుదల లోపించే అవకాశం ఉంటుంది. అలాగే గొంతునొప్పి, నోటిలోపల పూతల కారణంగా కూడా ఘన ఆహారాన్ని తినలేకపోవచ్చు. లక్షణాలు తగ్గాక క్రమంగా ఘన పదార్థాలను తినవచ్చు.

ఇవి అసలు వద్దు..

ప్రాసెస్ చేసిన, జంక్, ఆయిల్, క్యాన్డ్, షుగర్ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి. సమోసా, వడ, నామ్‌కీన్స్, కేక్, బిస్కెట్లు, పిజ్జా, పాస్తా, చైనీస్, ఫ్రెంచ్ ఫ్రైస్, జామ్, జెల్లీ, కోలాస్, సోడాలను తీసుకోకూడదు. కెఫీన్‌కు దూరంగా ఉండటం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
భగవంతుడా...! క్షణాల వ్యవధిలో అతడి జీవితం సమాప్తమైంది..
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
శబ్ధం వస్తే రోడ్డుమీద ఎవరైనా పడిపోయారేమో అనుకున్నారు.. కట్ చేస్తే
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
ఒకే బైక్‌పై నలుగురు ప్రయాణం.. ఇంతలోనే అనుకోని ఘటన
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
JEE Main 2024 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. 22 మందికి 100% మార్కులు
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఒక గంట మ్యూజిక్ ఈవెంట్‏కు కోట్లు వసూలు చేసే ఏకైక సింగర్..
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
ఘోర ప్రమాదం.. ఆగివున్న లారీని ఢీకొన్న కారు, ఆరుగురు మృతి
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
రూ. 10 వేలలో ఊహకందని ఫీచర్లు.. 100 ఎంపీ కెమెరాతో పాటు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
మరో మల్టీప్లెక్స్‌ ప్రారంభించనున్న మహేష్‌.. ఈసారి ఎక్కడో తెలుసా.?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?
ఖమ్మం టికెట్‌ కేటాయింపుతో కాంగ్రెస్‌ వ్యూహమేంటి..?