Health Tips: నైట్ షిప్ట్స్ చేస్తున్నారా ? ఆ జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యానికి డేంజర్..

ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా.. పురుషులతోపాటు.. మహిళలు కూడా రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. లాంగ్ నైట్ షిఫ్ట్ కారణంగా..

Health Tips: నైట్ షిప్ట్స్ చేస్తున్నారా ? ఆ జాగ్రత్తలు పాటించకపోతే ఆరోగ్యానికి డేంజర్..
Night Shift

Edited By: Rajitha Chanti

Updated on: Jul 19, 2021 | 1:19 PM

ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా.. పురుషులతోపాటు.. మహిళలు కూడా రాత్రి వేళల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. లాంగ్ నైట్ షిఫ్ట్ కారణంగా.. చాలా మంది జీవన శైలీ మారుతుంటుంది. అంతేకాకుండా.. పని ఒత్తిడితో తీసుకునే ఆహారం పై సరైన శ్రద్ద తీసుకోరు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు బారీన పడుతుంటారు. అయితే ఇటీవల కాలంలో నైట్ షిఫ్ట్ చేసేవారి జీవనశైలిలో మార్పులు చోటు చేసుకోవడంతో వారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది. అలా కాకుండా.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఎలాగో తెలుసుకుందామా.

తగినంత నిద్ర..
నైట్ షిఫ్ట్‏ చేసేవారు పగటి సమయంలో తగినంత నిద్ర పోవాలి. నిద్ర లేకపోవడం వలన అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. దీంతో అలసట, బలహీనంగా మారిపోవడం జరుగుతుంది. అందుకే రాత్రిళ్లు చురుకుగా పనిచేయాలంటే పగటి నిద్ర అవసరం.

జంక్ ఫుడ్ మానుకోవాలి..
నైట్ షిఫ్ట్ చేసే సమయంలో జంక్ ఫుడ్‏కు దూరంగా ఉండాలి. రాత్రి సమయంలో తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. వేయించిన ఆహారం, జంక్ ఫుడ్ తీసుకోకుడదు. తేలికపాటి ఆహారం తీసుకోవడం వలన కళ్లకు మంచిది. అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది.

టీ, కాఫీ తాగవద్దు..
నైట్ షిఫ్ట్ చేసేవారు ఎక్కువగా టీ, కాఫీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో శరీరంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకు బదులుగా రాత్రిళ్లు ఎక్కువగా నీరు తాగాలి.

పండ్లను తీసుకోవాలి..
మీరు రోజూ తీసుకునే ఆహారంలో పండ్లను జత చేసుకోవాలి. రాత్రిళ్లు పనిచేసే ప్రజలు ఎక్కువగా పండ్లను తినడం వలన ఉత్సాహంగా ఉంటారు. అలాగే ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వ్యాయమం..
నైట్ షిఫ్ట్ చేసేవారు ఉదయాన్నే వ్యాయమం చేయలేరు. కానీ.. రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయమం చేయాలి. యోగా చేయడానికి ఒక నిర్ణిత సమయాన్ని అలవరుచుకోవాలి. రాత్రిళ్లు పనిచేయడం వలన శారీరక శ్రమ తగ్గుతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలను మొదలవుతాయి. అందుకే రోజుకు కొద్ది సమయం వ్యాయమానికి కేటాయించాలి.

Also Read: Eesha Rebba: తెలుగు ముద్దుగుమ్మకు టాలీవుడ్‏లో ఆఫర్స్.. నెట్టింట్లో ఈషా రెబ్బా హల్‏చల్..

Karthika Deepam: మోనిత గతం వెలుగులోకి.. అంజిని పట్టుకుంటే నిజం తెలుస్తుందంటున్న దీప..