AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Tips: పాలు తాగూతు కూడా బరువు తగ్గొచ్చని తెలుసా.? ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే సరి.

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. పాలలో ఉండే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారనే అపోహ కొందరిలో ఉంటుంది. ముఖ్యంగా పాలలో ఉండే కొవ్వు పదార్థాలు బరువు..

Weight Loss Tips: పాలు తాగూతు కూడా బరువు తగ్గొచ్చని తెలుసా.? ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే సరి.
Weight Loss
Narender Vaitla
|

Updated on: Dec 07, 2022 | 10:05 AM

Share

పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే విషయం తెలిసిందే. పాలలో ఉండే ప్రోటీన్లు, కాల్షియం, విటమిన్లు వంటి పోషకాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. అయితే పాలు తాగడం వల్ల బరువు పెరుగుతారనే అపోహ కొందరిలో ఉంటుంది. ముఖ్యంగా పాలలో ఉండే కొవ్వు పదార్థాలు బరువు పెరగడానికి కారణమవుతుందని భావిస్తుంటారు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం ద్వారా పాలు తాగుతూ కూడా శరీర బరువును పెరగకుండా అడ్డుకోవడమే కాదు, తగ్గకుండా కూడా చూసుకోవచ్చు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

* పాలు తాగడం వల్ల బరువు పెరగకూడదంటే పాలలో తేనె కలుపుకొని తాగాలి. ఇలా చేయడం వల్ల బరువు పెరగకుండా ఉండొచ్చు, అలాగే పాలలో ఉండే పోషకాలు కూడా పొందొచ్చు.

* సాధారణంగా పాలలో కొవ్వు ఉంటుందనే విషయం తెలిసిందే. దీనివల్లే శరీరం బరువు పెరుగుతుంది. అందుకే ఫ్యాట్ తక్కువ ఉండే పాలను తీసుకోవాలి. మార్కెట్లో లో ఫ్యాట్‌ పాలు కూడా లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

* ఇక పాలలో పసుపు కలుపుకొని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని తెలిసిందే. అయితే పసుపు, పాలు కలిపి తాగడం వల్ల శరీరం బరువు కూడా తగ్గుతుంది.

* వ్యాయామం చేసిన తర్వాత పాలు తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం ద్వారా కోల్పోయిన శక్తిని పాలతో ఇన్‌స్టంట్‌గా పొందొచ్చు. పాలలోని పోషకాల వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* రాత్రపూట పడుకునే సమయంలో పాలు తగ్గడం ఉత్తమం. శరీరం బరువు అదుపులో ఉండాలంటే రాత్రి పడుకునే ముందు పాలు తాగితే కచ్చితంగా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కొందరు నిపుణుల అభిప్రాయాలు, సూచనల మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో నేరుగా వైద్యులను సంప్రదించి, వారి సూచనలు పాటించడమే ఉత్తమమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
పైలట్లుగా ఉన్న తండ్రీ కూతురి.. సరదా సంభాషణ... నెట్టింట వైరల్!
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
2 కోట్లతో బడ్జెట్.. 122 కోట్ల కలెక్షన్స్.. 21 ఏళ్ల అమ్మాయి సంచలనం
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
నిమ్మకాయ,లవంగాలతో దోమలను ఇంట్లోంచి ఈజీగా తరిమేయండి..ఖర్చులేని పని
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
పాలు, గుడ్లు కన్నా పవర్ఫుల్.. రోజూ గిన్నెడు తింటే చాలు
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
కొలెస్ట్రాల్, బీపీ టెన్షన్ పోవాలంటే.. రోజూ తిన్న తర్వాత ఈ చిన్న..
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
NEET PGలో కీలక మార్పు.. ప్లీజ్ చెక్!
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్పీకర్ గడ్డం ప్రసాద్ కంటతడి.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
మూడు శుభ గ్రహాలు అనుకూలం.. వీరికి ఇక సమస్యలు లేని జీవితం
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
కొత్త ఇల్లు నిర్మించేటప్పుడు పునాది లెవల్‌ వరకు ఎంత ఖర్చు ?
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..
మంచి జీవితం చూపిస్తానని చెప్పి.. తీసుకెెళ్లి వ్యభిచార కూపంలోకి..