Lifestyle: ఇలాచేస్తే స్కిన్‌ ఎలర్జీ ఎప్పటికీ మీ దరిచేరదు..

|

Mar 16, 2024 | 10:50 PM

సాధారణంగా చర్మంపై దురద, ఎరుపు రంగులోకి చర్మం మారడం, దద్దుర్లు లాంటి లక్షణాలు స్కిన్‌ ఎలర్జీలో ఎక్కువగా కనిపిస్తాయి. మొదట్లోనే ఈ సమస్యకు చికిత్స తీసుకోకపోతే ఎలర్జీ విస్తరించే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎలర్జీ ఒళ్లంతా పాకే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు...

Lifestyle: ఇలాచేస్తే స్కిన్‌ ఎలర్జీ ఎప్పటికీ మీ దరిచేరదు..
Skin Allergy
Follow us on

స్కిన్‌ ఎలర్జీ అనేది సర్వసాధారణమైన ఆరోగ్య సమస్య. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. తీసుకునే ఆహారంలో మార్పులు, నీరు మారడం కారణం ఏదైనా మనలో చాలా మంది ఒక్కసారైనా ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటాం. ఒక పొల్యుషన్‌, ఎండ కూడా స్కిన్‌ ఎలర్జీకి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా వేసవిలో ఈ సమస్య బారిన పడే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.

సాధారణంగా చర్మంపై దురద, ఎరుపు రంగులోకి చర్మం మారడం, దద్దుర్లు లాంటి లక్షణాలు స్కిన్‌ ఎలర్జీలో ఎక్కువగా కనిపిస్తాయి. మొదట్లోనే ఈ సమస్యకు చికిత్స తీసుకోకపోతే ఎలర్జీ విస్తరించే ప్రమాదం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఎలర్జీ ఒళ్లంతా పాకే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటించడం, తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోవడం వల్ల స్కిన్‌ ఎలర్జీ సమస్యకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

స్కిన్‌ ఎలర్జీ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో విటమిన్ సి, ఇ, బీటా కెరోటిన్ అధికంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పండ్లు, కూరగాయలు, వాల్‌నట్‌లు, బీట్‌రూట్ వంటి ఆహారాలలో ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. వీటితో పాటు పెరుగు, ఎండుద్రాక్ష వంటి ప్రోబయోటిక్స్ చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయి. రోజుకు కనీసం 8 గ్లాసుల గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మ సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

స్కిన్‌ ఎలర్జీతో బాధపడుతేంటే జీవనశైలిలో కూడా కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. తరచుగా మార్కెట్ లో లభించే కెమికల్ సబ్బులు లేదా క్రీముల వల్ల చర్మం ప్రమాదంలో పడుతుంది. కాబట్టి కఠినమైన సబ్బు మరియు డిటర్జెంట్ వాడకూడదు. సింథటిక్ దుస్తులను ధరించడం తగ్గించుకోవాలి. సూర్యరక్ష్మికి ఎక్కువసేపు ఎక్స్‌పోజ్‌ కాకుండా చూసుకోవాలి. మానసిక ఒత్తిడి కూడా చర్మం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది కాబట్టి యోగా, మెడిటేషన్‌ వంటివి అలవాటు చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో మార్పులు, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల చర్మ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..