Health: పైల్స్‌ సమస్య వేధిస్తోందా..? వీటిని తీసుకోండి, వెంటనే ఫలితం ఉంటుంది..

|

Mar 01, 2022 | 7:20 AM

Health: ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో (Piles) ఒకటి. మారుతోన్న జీవనశైలి (Lifestyle), ఆహార అలవాట్ల కారణంగా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా షిప్ట్‌ల్లో పనిచేసే వారు, ఆహారం తీసుకునే సమయాల్లో ఒక పద్ధతి పాటించని వారు, గంటల తరబడి కూర్చోవడం...

Health: పైల్స్‌ సమస్య వేధిస్తోందా..? వీటిని తీసుకోండి, వెంటనే ఫలితం ఉంటుంది..
Piles Problem
Follow us on

Health: ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లో (Piles) ఒకటి. మారుతోన్న జీవనశైలి (Lifestyle), ఆహార అలవాట్ల కారణంగా ఈ సమస్య వస్తుంది. ముఖ్యంగా షిప్ట్‌ల్లో పనిచేసే వారు, ఆహారం తీసుకునే సమయాల్లో ఒక పద్ధతి పాటించని వారు, గంటల తరబడి కూర్చోవడం, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, ఇలా రకరకాల కారణంగా పైల్స్‌ సమస్య వేధిస్తుంటుంది. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ పైల్స్‌ సమస్యకు చెక్‌ పెట్టవచ్చనే విషయం మీకు తెలుసా.? పైల్స్‌ సమస్యను సహజంగా తగ్గించుకోవడానికి డైట్‌లో కచ్చితంగా కొన్ని ఆహార పదార్థాలను చేర్చాలి.. అవేంటంటే..

  1. సహజంగా పైల్స్ సమస్యకు ప్రధాన కారణం జీర్ణ సమస్యలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి ఈ పైల్స్‌తో ఇబ్బంది పడుతున్న వారు బెల్లంను క్రమంతప్పకుండా తీసుకోవాలి. ప్రతి రోజూ రాత్రి భోజనం అనంతరం చిన్న బెల్లం ముక్కను తీసుకోవాలి. ఇలా చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. మరుసటి రోజు సుఖ విరేచనానికి కూడా దోహదపడుతుంది.
  2. పైల్స్‌ సమస్యను తగ్గించడంలో వెల్లుల్లి కూడా మంచి ఔషధంగా పని చేస్తుంది. ఉదయంలేవగానే పరగడుపున 3 లేదా 4 పచ్చి వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పెనంపై వేసి వేయించి అలాగే తినాలి. లేదా తేనేతో కలిపి తీసుకున్న పర్వాలేదు. ఇలా చేయడం వల్ల అజీర్ణం, మలబద్దకం తగ్గి పైల్స్‌ తగ్గుతుంది.
  3. పైల్స్‌ సమస్యతో బాధపడే వారు కిస్మిస్‌లను తీసుకోవాలి. వీటిలో ఉండే జింక్‌, కాల్షియం, విటమిన్లు ఎంతో మేలు చేస్తాయి. రాత్రిపూట కిస్మిస్‌లను తీసుకుంటే మరుసటి సుఖ విరేచనం అవుతుంది. దీంతో పైల్స్‌ సమస్య తగ్గుతుంది.
  4. బాదం పప్పు కూడా పైల్స్‌కు మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విట‌మిన్ ఇ, కాల్షియం, ఫాస్ఫర‌స్‌ పైల్స్‌కు విరుడుగా పనిచేస్తాయి. బాదంప‌ప్పును రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే వాటిని పొట్టు తీసి తినాలి. దీని వ‌ల్ల శ‌రీరంలోని వ్యర్థాలు బ‌య‌ట‌కు పోవ‌డంతోపాటు మ‌ల‌బ‌ద్దకం త‌గ్గుతుంది.
  5. ఇక పైల్స్‌ను దూరం చేసే ఆహార పదార్థాల్లో జామ పండు కూడా ఒకటి. జామ పండు తీసుకోవడం వల్ల మలబద్దకం ఉండదు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక జామ పండు తీసుకుంటే ఆహారం బాగా జీర్ణమవుతుంది.

నోట్‌: పైన తెలిపిన ఆహార పదార్థాలు పైల్స్‌ సమస్యను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సమస్య ప్రారంభంలో ఉంటేనే ఈ డైట్‌ పనిచేస్తుంది. ఒకవేళ మరీ ఎక్కువగా ఉంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా రక్తస్రావం ఎక్కువగా అయ్యేవారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే సర్జరీ లేకుండానే సమస్య నుంచి బయటపడొచ్చు..

Also Read: CM KCR Delhi Tour : ఢిల్లీ పర్యటనకు బయలుదేరిన సీఎం కేసీఆర్.. 3రోజుల పాటు అక్కడే.. ఎవరెవర్ని కలవనున్నారంటే?

Narayana Swamy-YS Jagan: సినిమా హీరో కాదు.. సీఎం జగన్ హీరోలకే హీరో.. ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

Russia Ukraine War: వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన కర్ణాటక.. ఆ రాష్ట్రంలో ఎక్కడికెళ్లిన ఫ్రీ..