Diabetes: ఈ ఆకు తింటే డయాబెటిస్‌కు ఓం బీమ్ బుష్.. రోగానికి మడతపెట్టినట్లే..

|

Mar 01, 2024 | 1:05 PM

ఆధునిక కాలంలో మధుమేహ వ్యాధి ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తోంది. భారత్‌తో సహా అనేక దేశాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది సంక్లిష్టమైన వ్యాధి.. దీనికి మందు అంటూ ఏదీ లేదు.. రోగి తన రక్తంలో చక్కెర స్థాయిని ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. అంతేకాకుండా.. చక్కెర స్థాయిలు పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండాలి..

Diabetes: ఈ ఆకు తింటే డయాబెటిస్‌కు ఓం బీమ్ బుష్.. రోగానికి మడతపెట్టినట్లే..
Fenugreek Leaves For Diabetes
Follow us on

ఆధునిక కాలంలో మధుమేహ వ్యాధి ప్రపంచమంతటా వేగంగా విస్తరిస్తోంది. భారత్‌తో సహా అనేక దేశాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇది సంక్లిష్టమైన వ్యాధి.. దీనికి మందు అంటూ ఏదీ లేదు.. రోగి తన రక్తంలో చక్కెర స్థాయిని ఎల్లప్పుడూ తనిఖీ చేయాలి. అంతేకాకుండా.. చక్కెర స్థాయిలు పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుండాలి.. కొద్దిపాటి అజాగ్రత్తగా వ్యవహరించిన ప్రాణాంతకం కావొచ్చు.. ఎందుకంటే ఇది మూత్రపిండాల వ్యాధి, గుండెపోటు వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అటువంటి పరిస్థితులలో, రోగులు గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించగల ఆహారాన్ని ఎంచుకోవాలి. డయాబెటిస్ నిర్ధారణ అయిన వారు.. వ్యాయామాలు చేయడంతోపాటు..తీసుకునే ఆహారంపై దృష్టిపెట్టాలి.. మంచి జీవనశైలిని అవలంభించాలి.. అయితే, డయాబెటిక్ రోగులకు మెంతులు లేదా మెంతికూర తీసుకోవడం చాలా ప్రయోజనకరమని, ఇంకా రైతాలో మెంతి ఆకులను కలిపి తీసుకుంటే ఇంకా మేలని నిపుణులు సూచిస్తున్నారు. మెంతులు లేదా మెంతికూర డయాబెటిస్ రోగులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది కావున ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మెంతికూర రైతా శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతి ఆకులు – విత్తనాలను తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • మెంతి ఆకుల ద్వారా ఆహార సువాసన పెరుగుతుంది. పొటాషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ కె, ఫోలిక్ యాసిడ్, రిబోఫ్లిన్, కాపర్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది మధుమేహానికి వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది కార్బోహైడ్రేట్ల శోషణను నెమ్మదిస్తుంది.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  • మీకు కావాలంటే, మీరు మెంతి గింజలను కూడా ఉపయోగించవచ్చు. ఇది డయాబెటిక్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించవచ్చు.
  • మధుమేహంలో మెంతి నీరు కూడా చాలా మేలు చేస్తుంది. ఇందుకోసం మెంతికూరను రాత్రంతా వేడి నీటిలో నానబెట్టి వడగట్టి ఉదయాన్నే తాగాలి. కావాలంటే మెంతికూరను నీళ్లలో మరిగించిన తర్వాత ఆ నీటిని చల్లార్చి తాగవచ్చు.
  • మీరు మెంతులతోపాటు దీని ప్రభావాన్ని పెంచాలనుకుంటే, అనేక ఇతర మసాలా దినుసులను ఇందులో కలపవచ్చు. ఇందుకోసం మెంతి గింజలను మెత్తగా రుబ్బుకుని దాని పొడిని తయారు చేసి అందులో ఉసిరి పొడి, పసుపు కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక చెంచాలో తీసుకుని ప్రతిరోజూ మూడుసార్లు తినాలి.

అయితే, మెంతులు వెండి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. కావున వీటిని తగినంత పరిణామంలోనే తీసుకోవాలి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి