Wegovy: స్థూలకాయస్థులకు శుభవార్త.. బరువు తగ్గించే ఇంజక్షన్ వచ్చింది.. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?

|

Nov 06, 2021 | 2:41 PM

స్థూలకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బరువు తగ్గించే ఔషధం త్వరలో భారత మార్కెట్‎లోకి రాబోతుంది. ఈ ఔషధం ఇప్పటికే అమెరికాలో విడుదలైంది...

Wegovy: స్థూలకాయస్థులకు శుభవార్త.. బరువు తగ్గించే ఇంజక్షన్ వచ్చింది.. మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?
Wegovy
Follow us on

స్థూలకాయంతో బాధపడుతున్న వారు ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బరువు తగ్గించే ఔషధం త్వరలో భారత మార్కెట్‎లోకి రాబోతుంది. ఈ ఔషధం ఇప్పటికే అమెరికాలో విడుదలైంది. ‘వీగోవీ’ అనే ఇంజక్షన్ రూపంలో ఈ మందు లభ్యం కానుంది. ‘వీగోవీ’ ఇంజక్షన్ అమెరికాకు చెందిన కంపెనీ నోవో నార్డిస్ తయారుచేసింది. ఈ మందు తీసుకుంటే 15 శాతం బరువు తగ్గిపోయే అవకాశం ఉందని
ఆ కంపెనీ తెలిపింది. వీగోవీ ఇంజక్షన్ జూన్‎లో అమెరికా ఔషధ నియంత్రణ మండలి నుంచి అనుమతి పొందింది.

బరువు తగ్గించే ఓ మెడిసిన్‌కి అనుమతి లభించడం ఇదే తొలిసారని తెలుస్తోంది. ఈ ఇంజక్షన్ కోసం మెడికల్ షాపులకు అమెరికన్స్ పరుగులు తీస్తున్నారు. అయితే ఈ ఇంజక్షన్ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా బరువు తగ్గాలంటే దీర్ఘకాలం కృషిచేయాలని వివరిస్తున్నారు. వ్యాయామం, కఠిన ఆహారపు అలవాట్లు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

ఇలాంటివి ఏవి లేకుండా బరువు తగ్గే ఔషధం రావటంతో ఊబకాయుస్థులు బరువు ఎగిరి గంతేస్తున్నారు. అయితే వీగోవీ ఇంజక్షన్ వల్ల దుష్ప్రభావాలు తక్కువేనని ఆ కంపెనీ చెబుతోంది. ఈ ఇంజక్షన్‎తో గత క్వార్టర్ లో కంపెనీ ఆదాయం 41 శాతం పెరిగింది. ఈ మందు తీసుకోవాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఇంజక్షన్‎ను వారానికి ఒక డోసు తీసుకోవాలి. ఈ మందు ఆకలిని నియంత్రించి ఎక్కువ తినకుండా చేస్తుంది.ఈ ఇంజక్షన్ కోర్సుతో 15 శాతం వరకు బరువు తగ్గుతారని నోవో నార్డిస్ కంపెనీ చెప్పింది.

మందు పనిచేసే తీరు..
ఇది మనిషి ఆకలి తీరును ప్రభావితం చేసే హార్మోన్‎ను అనుకరిస్తుంది. జీఎల్ పీ-1 హార్మోన్‎ను వీగోవీ మందు ప్రభావితం చేస్తుంది. జీఎల్ పీ-1 హార్మోన్ పేగుల్లోని ‘ఎల్’ కణాల్లో ఉత్పత్తి అవుతుంది. జీఎల్ పీ -1 హార్మోన్ అంత్రమూల క్రియాశీలత, గ్యాస్ట్రిక్ ఆమ్లాల నియంత్రణ, గ్లూకగాన్ స్రావాల నియంత్రణకు ఉపయోగపడుతుంది.

వీగోవీతో స్వల్ప దుష్ర్పభావాలు…
వాంతులు, యాసిడ్‌ రీఫ్లక్స్( ఆమ్లాలు పైకి రావడం) వంటివి కన్పిస్తాయి

Read Also..సంచలనాలకు సిద్ధమైన మారుతి సుజుకి.. ఇండియాలోనే అత్యధిక మైలేజ్‌ కారుతో మార్కెట్‌లోకి ఎంట్రీ.. పూర్తి వివరాలు మీకోసం..!

Ola Grocery Delivery: వినియోగదారులకు ఓలా గుడ్‌న్యూస్‌.. ఆన్‌లైన్‌లో కిరాణా సరుకుల డెలివరీ..!