Eyes Care Tips: ఈ సమస్యలు కంటిచూపు కోల్పోయేందుకు కారణం కావచ్చు

|

Apr 30, 2022 | 6:56 AM

Loosing Eyesight Reasons: కళ్ళు మన శరీరం మాత్రమే కాదు.. జీవితంలో ఒక భాగం. ఇవి లేకుండా మెరుగైన జీవితాన్ని ఊహించలేము. కొంతమంది కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కానీ..

Eyes Care Tips: ఈ సమస్యలు కంటిచూపు కోల్పోయేందుకు కారణం కావచ్చు
Follow us on

Loosing Eyesight Reasons: కళ్ళు మన శరీరం మాత్రమే కాదు.. జీవితంలో ఒక భాగం. ఇవి లేకుండా మెరుగైన జీవితాన్ని ఊహించలేము. కొంతమంది కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కానీ వారు ప్రపంచాన్ని చూడలేరు. వెలువడుతున్న గణాంకాల ప్రకారం.. ప్రపంచంలో దాదాపు 4.3 బిలియన్ల మంది అంధత్వానికి (Blindness) గురవుతున్నారు. మరోవైపు దృష్టి లేదా కంటి చూపు కారణాలకు (Loosing eyesight reasons) సంబంధించిన ఇతర సమస్యల వల్ల 295 మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారు. చిన్నతనం నుండి అంధత్వంతో బాధపడుతున్న వ్యక్తులు జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ వారు దానికి అలవాటు పడతారు. కొన్ని కారణాల వల్ల కంటి పోయినట్లయితే పరిస్థితి భయానకంగా మారుతుంది. కళ్లలో ఆకస్మిక అంధత్వం పూర్తిగా వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. కంటి చూపు సమస్య ఉంటే ప్రపంచం చీకటిమయంగా మారుతుంది.

చాలా మంది వ్యక్తులు లేదా పిల్లలు తమ సమయాన్ని ఎక్కువగా చదవడ, రాయడం, ఫోన్ లేదా టీవీ చూడటం వంటి వాటితో గడుపుతారు. కొంతమంది ల్యాప్‌టాప్ లేదా మరేదైనా స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఎవరికైనా కళ్లు చికటిగా కనిపిస్తూ, ఏదో సమస్య ఉన్నట్లు అనిపించినట్లయితే అప్రమత్తంగా ఉండాలి. ఈ స్థితిలో, రెటీనా కింద రక్తనాళం ఏర్పడుతుంది. ఇది కంటి సమస్యు దారి తీస్తుంది. దీనిని వెట్-AMD అంటారు. ఇది కంటి చూపును దూరం చేస్తుంది.

గ్లాకోమా

మన శరీరంలో ఉండే ఆప్టిక్ నాడి మెదడుకు సమాచారాన్ని, చిత్రాలను ప్రసారం చేస్తుంది. మీరు గ్లాకోమా లేదా బ్లాక్ గ్లాకోమాతో బాధపడుతుంటే, ఈ వ్యాధులు ఆప్టిక్ నరాల పనితీరును ప్రభావితం చేస్తాయి. గ్లాకోమా ఎటువంటి లక్షణాలను చూపించదు. అయితే ఇది కంటి చూపును కోల్పోయేలా చేస్తుంది. దీని ప్రభావం ప్రారంభంలో కనిపించదు. కానీ కళ్లు తిరగడం, వికారం, మసకబారడం, ఒక్కోసారి చుట్టూ రంగుల ఉంగరాలు కనిపించినట్లుగా ఉండటం వంటి సమస్యలు రావచ్చు.

కంటిశుక్లం:

అంధత్వానికి ఇది అతి పెద్ద కారణమని పరిగణిస్తారు. కంటిశుక్లంతో బాధపడుతున్న వ్యక్తి కంటి లెన్స్‌పై అధిక ప్రభావం పడుతుంది. అది రెటీనాను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. మధుమేహం, వృద్ధాప్యం, మద్యం సేవించడం వంటి సమస్యలు కంటిశుక్లం రావడానికి కారణం కావచ్చు. మీరు కంటిశుక్లం బారిన పడి, మీకు మధుమేహం కూడా ఉంటే, ఈ పరిస్థితి మీకు ప్రమాదకరంగా మారవచ్చు.

(గమనిక: ఇందులోని అంశాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Skin Cancer: అధిక సూర్యకాంతి వల్ల చర్మ క్యాన్సర్‌.. లక్షణాలు ఏమిటి? రక్షించుకునేందుకు చిట్కాలు!

Back Pain Remedies: వెన్నునొప్పికి దాల్చిన చెక్కతో ఉపశమనం.. ఇలా వాడితే అద్భుతమైన ప్రయోజనం..