Eye Tips: వయసు పెరుగుతున్నకొద్ది కళ్లు దెబ్బతింటాయి.. ఈ నాలుగు జాగ్రత్తలు పాటిస్తే కళ్లు ఆరోగ్యవంతం

| Edited By: Anil kumar poka

Apr 08, 2022 | 8:06 AM

Eye Tips: ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు మనకు సాధనం. కానీ నేటి కాలంలో ప్రజలు గంటల తరబడి కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు. దీని వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి...

Eye Tips: వయసు పెరుగుతున్నకొద్ది కళ్లు దెబ్బతింటాయి.. ఈ నాలుగు జాగ్రత్తలు పాటిస్తే కళ్లు ఆరోగ్యవంతం
Follow us on

Eye Tips: ప్రపంచాన్ని చూడడానికి కళ్ళు మనకు సాధనం. కానీ నేటి కాలంలో ప్రజలు గంటల తరబడి కంప్యూటర్ లేదా ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ ఉంటారు. దీని వల్ల కంటి సమస్యలు వస్తున్నాయి. ఇది కాకుండా వయస్సు సంబంధిత కారకాలు, వ్యాధికి గురికావడం కూడా మన కళ్ళపై (Eyes) ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.కంటికి సంబంధించిన అనేక సమస్యలు (Eyes Related Problems) ఉన్నాయి. దీని వల్ల ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిలో , కళ్లు ఎర్రబడడం, కళ్లు అలసిపోవడం, కళ్లలో కొన్ని మచ్చలు కనిపించడం వంటి సమస్యలు ఉన్నాయి. అయితే వయసు పెరిగే కొద్దీ కళ్ల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు కంటి వైద్య నిపుణులు. కంటి అలర్జీలు, అస్పష్టమైన దృష్టి, పొడి కళ్ళు, గ్లాకోమా40 ఏళ్ల తర్వాత మిమ్మల్ని చుట్టుముట్టడం వంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని ఎలా చూసుకోవాలో కంటి వైద్యుడి నుంచి తెలుసుకుందాం.

హైదరాబాద్‌లోని శ్రీ శంకర నేత్రాలయ కంటి ఆసుపత్రి గ్లకోమా కన్సల్టెంట్ డాక్టర్ రోమా జోహ్రీ తెలిపిన వివరాల ప్రకారం.. వయస్సు పెరుగుతున్న వ్యక్తులలో అనేక కంటి సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. అటువంటి సమస్య ప్రెస్బియోపియా అంటారు. దీనిలో వస్తువులను దగ్గరగా లేదా చిన్న అక్షరాలను చూడటం కష్టం. పొడి కంటి వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య దాదాపు 1.9 మిలియన్లు. 2030 నాటికి పట్టణ జనాభాలో 40 శాతం మంది పొడి కంటి వ్యాధికి గురవుతారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు వయస్సు పెరిగే కొద్దీ మీ కంటి చూపు క్షీణించే అవకాశాలను తగ్గించవచ్చు. వృద్ధాప్యంలో కూడా మీ కళ్ళు షార్ప్‌గా ఉండాలంటే ఇక్కడ 4 జాగ్రత్తలు ఉన్నాయి.

  1. మీ కళ్ళను క్రమం తప్పకుండా చెక్‌ చేసుకోండి: మీ కళ్లలో ఎలాంటి సమస్య లేదని మీకు అనిపించవచ్చు. కానీ అది కంటి నిపుణుడిచే పరీక్షించబడినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కంటి పరీక్షల ద్వారా అద్దాలు అవసరమా కాదా అని మాత్రమే కాకుండా, ముందుగానే గుర్తిస్తే సమర్థవంతంగా చికిత్స చేయగల కంటి వ్యాధులను కూడా గుర్తించవచ్చు. మీకు 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నట్లయితే లేదా మీకు ఏదైనా కంటి వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నట్లయితే కంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి.
  2. స్క్రీన్‌పై తక్కువ సమయం గడపడం: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది కంప్యూటర్ల ముందు, స్మార్ట్‌ఫోన్‌ల ముందు గడపడం ఎక్కవైపోయింది. దీంతో అనేక కంటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా డ్రై ఐ సమస్య సర్వసాధారణంగా మారింది. చాలా మంది వృద్ధులు తమ అద్దాలను మార్చుకుంటున్నారు. ఎందుకంటే చాలా సెల్ ఫోన్ వాడకం వల్ల వారి కంటి చూపు బలహీనపడింది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మీ కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు మీరు మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. డిజిటల్ పరికరాల ద్వారా వెలువడే హై ఎనర్జీ బ్లూ లైట్ కళ్లకు చాలా హానికరం. కాబట్టి ఈ విషయాలను కూడా గుర్తుంచుకోవాలి. కంప్యూటర్‌ స్క్రీన్‌, మొబైల్‌ స్కీన్‌లు కళ్లకు కనీసం 20-24 అంగుళాల దూరంలో ఉంచండి. స్క్రీన్‌పై కాంతిని తగ్గించండి. తరచుగా కళ్లను బ్లింక్ చేయండి. ప్రతి గంటకు కనీసం 10-15 నిమిషాలు విరామం తీసుకోండి.
  3. ఆరోగ్యకరమైన ఆహారం తినండి: కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. ముదురు ఆకుకూరలు, ముఖ్యంగా కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ మరియు బచ్చలికూరలో యాంటీఆక్సిడెంట్లు అయిన లుటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. కంటిశుక్లం రాకుండా ఇది సహాయపడుతుంది. ద్రాక్ష కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుందని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ద్రాక్షలు లుటీన్ కంటే కళ్ళకు అధిక స్థాయిలో యాంటీఆక్సిడెంట్ రక్షణను అందిస్తాయి. సాల్మన్ వంటి కొవ్వు చేపలలో అవసరమైన ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ముఖ్యమైనవి.
  4. తగినంత నిద్ర: మీకు తగినంత నిద్ర లేకపోతే, మీకు చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కొన్ని లక్షణాలు డ్రై ఐ సిండ్రోమ్,కంటి తిమ్మిరి కావచ్చు. మీరు బాగా నిద్రపోయినప్పుడు, శరీరం కోలుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. కళ్ళు పునరుత్పత్తికి తగినంత సమయం లభిస్తుంది. ఇది స్పష్టమైన మెరుగైన దృష్టికి, మెరుగైన కంటి లూబ్రికేషన్‌తో పాటు కళ్లలో చుట్టూ ఉన్న ఆరోగ్యకరమైన కణజాలం, నరాల పెరుగుదలకు దారితీస్తుంది. సరిగ్గా నిద్రపోతే కంటికి సంబంధించిన తలనొప్పి దరిచేరదు.

ఇవి కూడా చదవండి:

Benefits Of Chilli Pickle: పచ్చి మిరపకాయ పచ్చడి తింటే అద్భుతమైన లాభాలు.. ఈ సమస్యలను తగ్గిస్తుంది..

Banana Peel Benefits: అరటి తొక్కలో అద్భుత గుణాలు.. వీటిని అస్సలు కోల్పోకండి..!