Amyloidosis: అమిలోయిడోసిస్ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది..? పురుషులే అత్యధిక మంది బాధితులు.. వివరాలు..

|

Jun 13, 2022 | 9:39 PM

నవంబర్-3,2007లో పాక్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు గాను మార్చి-31,2014న ముషార్రఫ్ పై రాజద్రోహం కేసు నమోదైంది.

Amyloidosis: అమిలోయిడోసిస్ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది..? పురుషులే అత్యధిక మంది బాధితులు.. వివరాలు..
Pervez Musharraf
Follow us on

Pervez Musharraf suffers Amyloidosis: పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అమిలోయిడోసిస్ వ్యాధి బారిన పడిన ఆయన కోలుకునే అవకాశం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో పర్వేజ్ ముషారఫ్ కుటుంబం.. ఆయన కోసం ప్రార్థించాలని కోరుతూ ట్వీట్ చేసింది. ‘‘ముషారఫ్ వెంటిలేటర్‌పై లేరు.. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారు. అమిలోయిడోసిస్ వ్యాధి కారణంగా ఆయన గత 3 వారాలుగా ఆసుపత్రిలో ఉన్నారు. కోలుకోవడం సాధ్యం కాని వ్యాధి.. అవయవాలు పనిచేయక పోవడంతో చివరి దశలో చికిత్స పొందుతున్నారు. ఆయన కోసం ప్రార్థించండి’’ అంటూ ముషారఫ్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.

అయితే.. పాకిస్తాన్ మీడియా శుక్రవారం (జూన్ 10, 2022) నాడు ముషారఫ్ మరణించారనే వార్తలను ప్రసారం చేసింది. ఆ తర్వాత ముషారఫ్ కుటుంబం చేసిన ట్వీట్‌తో ఈ గందరగోళం సద్దుమణిగింది. వార్తలన్నీ అవాస్తవమని నిరూపితమైంది.

పాకిస్తాన్ దినపత్రిక ది డాన్ ప్రకారం.. నవంబర్-3,2007లో పాక్ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు గాను మార్చి-31,2014న ముషార్రఫ్ పై రాజద్రోహం కేసు నమోదైంది. దీంతో మెడికల్ ట్రీట్మెంట్ కోసమంటూ 2016 మార్చిలో పాక్ విడిచి దుబాయ్ వెళ్లారు. ఆ తర్వాత ఆయన తిరిగి పాకిస్తాన్‌కు వెళ్లలేదు.

ఇవి కూడా చదవండి

అమిలోయిడోసిస్ బారిన 70 శాతం మంది పురుషులు

అమిలోయిడోసిస్ అనేది శరీరంలో అసాధారణమైన అమిలాయిడ్ పదార్థాలు ఏర్పడటం ద్వారా వచ్చే అరుదైన వ్యాధి. మయోక్లినిక్ ప్రకారం.. గుండె, మెదడు, మూత్రపిండాలు, ప్లీహము, శరీరంలోని ఇతర భాగాలలో అమిలాయిడ్ పదార్థాలు ఏర్పడతాయి. ఒక వ్యక్తికి ఒక అవయవం లేదా అనేక అవయవాలలో అమిలోయిడోసిస్ ఉండవచ్చు.

జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ ప్రకారం.. అమిలోయిడోసిస్ ఉన్నవారిలో దాదాపు 70 శాతం మంది పురుషులు ఉన్నారు. దీర్ఘకాలిక మూత్రపిండ డయాలసిస్‌ను చేయించుకునే వ్యక్తుల్లో ఒక రకమైన అమిలోయిడోసిస్‌ను అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది. అయితే ఆధునిక డయాలసిస్ పద్ధతులు దీనిని తక్కువగా చేస్తాయి.

పెద్ద వారిలో అమిలోయిడోసిస్ ప్రమాదం మరింత పెరుగుతుంది. అమిలోయిడోసిస్ మల్టిపుల్ మైలోమా అని పిలువబడే క్యాన్సర్ రూపంలో 15 శాతం మంది రోగులను ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంగా డయాలసిస్‌లో ఉన్న చివరి దశ మూత్రపిండ వ్యాధి ఉన్నవారిలో కూడా అమిలోయిడోసిస్ సంభవించే అవకాశం ఉంది.

జన్యువులోని మ్యుటేషన్ కారణంగా లేదా బయటి కారకాల వల్ల ఏర్పడుతుంది..

మయో క్లినిక్ నివేదిక ప్రకారం.. కొన్నిసార్లు అమిలోయిడోసిస్ జన్యువులోని ఉత్పరివర్తన కారణంగా సంభవిస్తుంది. ఇతర ఇన్ఫ్లమేటరీ వ్యాధులు లేదా దీర్ఘకాలిక డయాలసిస్ వంటి బయటి కారకాల వల్ల కలుగుతాయి.

అనేక రకాలు బహుళ అవయవాలను ఇది ప్రభావితం చేస్తాయి. మరికొన్ని దశల్లో శరీరంలోని ఒక భాగాన్ని మాత్రమే ప్రభావితం చేస్తాయి.

అమిలోయిడోసిస్ నయం అవుతుందా..?

అమిలోయిడోసిస్‌కు చికిత్స లేదు. తీవ్రమైన అమిలోయిడోసిస్ ప్రాణాంతక అవయవ వైఫల్యానికి దారితీస్తుంది. కానీ చికిత్సలు మీ లక్షణాలను తగ్గించడానికి, అమిలాయిడ్ ప్రోటీన్ ఉత్పత్తిని పరిమితం చేయడంలో మీకు సహాయపడతాయి.

Source Link

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..