Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ లో హానికారక రసాయనాలు.. తాగారంటే సమస్యలకు వెల్ కమ్ చెప్పినట్లే..

|

Nov 19, 2022 | 6:48 AM

అలసటగా ఉన్నా, నీరసంగా అనిపించినా వెంటనే ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటాం. అవి తాత్కాలికంగా మంచి ఉపశమనాన్నే ఇచ్చినా.. దీర్ఘకాలంలో మాత్రం పెను ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి..

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ లో హానికారక రసాయనాలు.. తాగారంటే సమస్యలకు వెల్ కమ్ చెప్పినట్లే..
Energy Drinks
Follow us on

అలసటగా ఉన్నా, నీరసంగా అనిపించినా వెంటనే ఎనర్జీ డ్రింక్స్ తాగుతుంటాం. అవి తాత్కాలికంగా మంచి ఉపశమనాన్నే ఇచ్చినా.. దీర్ఘకాలంలో మాత్రం పెను ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి 10 నిమిషాల్లో 12 బాటిళ్ల ఎనర్జీ డ్రింక్ తాగి తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి తలెత్తింది. వీటిలో ఉండే చక్కెర, కెఫిన్, రసాయనాల కారణంగా ప్యాంక్రియాస్ ఇబ్బందులు వచ్చాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. కొన్నిసార్లు ఎనర్జీ డ్రింక్స్ కూడా స్పోర్ట్స్ పానీయాలుగా గుర్తింపు పొందినప్పటికీ నిజానికి మాత్రం అవి వాటికి భిన్నంగా ఉంటాయి. ఈ పానీయాల్లో అధిక మొత్తంలో కెఫీన్, చక్కెర, సోడా ఎక్కువ ఉంటుంది. అయితే.. ఈ పానీయాల వినియోగానికి సంబంధించి నియంత్రణ లేకపోవడం, యువతను ఆకర్షించడానికి మార్కెట్ ఏర్పరుచుకోవడం, అధికారుల నిఘా లేకపోవడం వంటి కారణాలుగా చెప్పవచ్చు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ 2007లో 12 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల 1,145 మంది పిల్లలు ఎనర్జీ డ్రింక్స్ కారణంగా ఎమర్జెన్సీ వార్డులలో చేరారని నివేదికలో వెల్లడించింది. 2011లో ఈ సంఖ్య 1,499కి పెరిగింది.

ఎనర్జీ డ్రింక్స్ లో అధిక మొత్తంలో చక్కెరలు ఉంటాయి. ఇది దంతాల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇది కేవిటీస్, హైపర్ సెన్సిటివిటీ వంటి సమస్యలకు దారి తీస్తుంది. దీర్ఘకాలం పాటు వీటిని వాడటం వల్ల శరీరంలోని జీవక్రియలపై ప్రభావం చూపుతుందని, ఇది కొలెస్ట్రాల్ లెవెల్స్ ను ఇన్ బ్యాలెన్స్ చేస్తుంది. మానసిక ఆరోగ్యం, హృదయ జీవక్రియపై చెడు ప్రభావాలు ఉంటాయి. ఎనర్జీ డ్రింక్స్‌లో ఉండే అత్యంత సాధారణ పదార్ధాలలో కెఫిన్ ఒకటి. కాబట్టి దాని దుష్ప్రభావాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. పానీయంలో ఉండే కెఫిన్ ఏకాగ్రత, చురుకు దనాన్ని పెంచడానికి ఉద్దేశితమైంది. కానీ కొన్ని సందర్భాల్లో విశ్రాంతి లేకపోవడం అనేది.. హృదయ స్పందనలో ఇబ్బందులు, నిద్రలేమి వంటి లక్షణాలను కలిగిస్తుంది.

హార్వర్డ్ నివేదిక ప్రకారం సరైన మోతాదులో 1.2 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. 10-14 గ్రాముల కెఫిన్ తీసుకోవడం ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. 1 గ్రాము మోతాదు నుంచి వచ్చే దుష్ప్రభావాలు విశ్రాంతి లేకపోవడం, చిరాకు, భయం, వాంతులు, వేగవంతమైన హృదయ స్పందన, వణుకుకు దారి తీస్తాయి. కాబట్టి ఎనర్జీ డ్రింక్స్ కు సాధ్యమైనంత దూరంగా ఉండటం మంచిది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.