Ragging: అసలు ఆరోగ్యకరమైన ర్యాగింగ్‌ అనేదే ఉండదు.. ర్యాగింగ్ భూతంపై మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Jul 28, 2022 | 11:32 AM

Ragging: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ మెడికల్‌ కాలేజీలో వెలుగులోకి వచ్చిన ర్యాగింగ్‌ అంశం దేశవ్యాప్తంగా ఎంత చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు...

Ragging: అసలు ఆరోగ్యకరమైన ర్యాగింగ్‌ అనేదే ఉండదు.. ర్యాగింగ్ భూతంపై మానసిక నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Follow us on

Ragging: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని మహాత్మా గాంధీ మెమోరియల్‌ మెడికల్‌ కాలేజీలో వెలుగులోకి వచ్చిన ర్యాగింగ్‌ అంశం దేశవ్యాప్తంగా ఎంత చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్లపై సీనియర్లు అత్యంత దాష్టీకంగా చేసిన ర్యాగింగ్‌ అందరినీ షాక్‌కి గురి చేసింది. అసహజ లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనాలని జూనియర్లను వేధిస్తున్నట్లు నమోదైన కేసు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశంలో ర్యాగింగ్‌ అనేది ఇప్పుడే మొదలు కాలేదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ రాక్షస క్రీడ కొనసాగుతూనే ఉంది. ర్యాగింగ్‌ భూతానికి బలైన వారు ఎందరో. అవమానం భరించలేక ఎంతో మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు కోకొల్లలు. దేశవ్యాప్తంగా ర్యాగింగ్ ఏ స్థాయిలో విజృంభిస్తోంది, దీనిపై మానసిక నిపుణులు ఏమంటున్నారు.? లాంటి వివరాలతో కూడిన విశ్లేషణాత్మక కథనం…

విద్యా సంస్థల్లో ర్యాగింగ్‌ అనే అంశం ఆందోళన కలిగిస్తూనే ఉంది. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ విద్యాబోధన అమల్లోకి రావడంతో ర్యాగింగ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే 2020తో పొలిస్తే 2021లో ర్యాగింగ్ కేసులు రెండింతలుగా నమోదయ్యాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది నమోదైన మొత్తం ఫిర్యాదులు, కరోనా మహమ్మారికి ముందు నమోదైన కేసుల్లో 50 శాతం మాత్రమే కావడం గమనార్హం. నిజానికి ఈ ర్యాగింగ్‌ కేసుల్లో ఎక్కువగా ఆన్‌లైన్‌ వేధింపులకు సంబంధించినవి కావడం పెద్ద సమస్యగా మారింది. యూజీసీ యాంటీ ర్యాగింగ్ వెబ్‌సైట్‌ వెల్లడించిన గణంకాల ప్రకారం.. 2020లో దేశవ్యాప్తంగా మొత్తం 511 కేసులు నమోదయ్యాయి. ఇక 2019లో 1070, 2018లో 1016 ఫిర్యాదులు అందాయి.

ఈ కేసుల్లో కొందరు సీనియర్లు ‘హెల్తీ ర్యాగింగ్‌’ పేరుతో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే అసలు హెల్తీ ర్యాగింగ్‌ అనేదే ఉండదని ముంబైకి చెందిన సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ హరీస్‌ శెట్టి అంటున్నారు. ర్యాగింగ్‌కు ఆరోగ్యకరమైన అనే పదం జోడించినంత మాత్రాన ఆరోగ్యకరంగా మారదని, అది మరింత అనారోగ్యకరమని అభిప్రాయపడ్డారు. ‘హెల్తీ ర్యాగింగ్‌’ పేరుతో చాలా మంది సీనియర్లు తమ జూనియర్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపిన శెట్టి.. ఒక చిన్న అవమానం కూడా వ్యక్తిని తీవ్రంగా గాయపరుస్తందని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక ర్యాగింగ్‌ అనేది మనుషుల ప్రవర్తన విధానంలో భాగమని అంటున్నారు ప్రముఖ న్యూరో సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ సంజయ్‌ చుగ్‌. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన సంజయ్‌ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ర్యాగింగ్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి హెల్తీ, మరొకటి అన్‌ హెల్తీ. ఆరోగ్యకరమైన ర్యాగింగ్‌ వినోదంతో కూడిన గేమ్స్‌ వంటివి ఉంటాయి. ఇలాంటివి ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుగుతాయి. కానీ ఇండోర్‌ ర్యాగింగ్‌ కేసు మాత్రం వ్యక్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని చెప్పుకొచ్చారు.

అయితే కొంతమంది సీనియర్లు మాత్రం జూనియర్లకు మెంటర్లుగా వ్యవహరిస్తారని సంజయ్‌, శెట్టిలు ఇద్దూ అభిప్రాయపడుతున్నారు. మెంటర్‌గా ఉండే వ్యక్తి ఎప్పుడైనా ఎదుటి వ్యక్తిని అసౌకర్యంగా ఫీలయ్యేలా చేయకడూదని శెట్టి అభిప్రాయపడ్డారు. జూనియర్లు, సీనియర్లకు మధ్య సత్సంబంధాలు ఏర్పడాల్సిన దానిపై దృష్టిసారించాలని తెలిపారు. ఇక సంజయ్‌ చుగ్‌ మాట్లాడుతూ.. జూనియర్లకు, సీనియర్లకు మధ్య పరస్పర సంభాషణ కచ్చితంగా ఉండాలి. అయితే మంచి వాతవారణంలో ఉండాలి కానీ, జూనియర్లను ఇబ్బంది గురిచేసేలా ఉండకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..