చలి చంపేస్తోంది. పొద్దు పొద్దునే వీస్తున్న చలిగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. తక్కువ ఉష్ణోగ్రతలతో వాతావరణం ఆహ్లాదంగా ఉన్నా అవి మోసుకొచ్చే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చలికాలంలో జలుబు, గ్యాస్ట్రిక్ సమస్యలు, దగ్గు, తలనొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ సీజన్‌లో రోగ నిరోధక వ్యవస్థ ఎక్కువగా ప్రభావితమవుతుంది. వీటిలో జుట్టు రాలడం ముఖ్యమైనది. అందుకే ఈ సీజన్‌లో హెల్తీ లైఫ్ స్టైల్ ను అనుసరించడం చాలా అవసరం. జుట్టు రాలడం, మైగ్రేన్, బరువు తగ్గడం, షుగర్ లెవల్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, హార్మోన్ల సమతుల్యత, ఉబ్బరం తలెత్తుతాయి. ఈ కాలంలో మెరుగైన రోగ నిరోధక శక్తిని పెంచుకుని, దగ్గు – జలుబును నివారించుకోవడానికి ఆయుర్వేద నిపుణులు ఓ పానీయాన్ని పరిచయం చేస్తున్నారు. దీనిని క్రమం తప్పకుండా తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండాలని చెబుతున్నారు. మైగ్రేన్, అధిక రక్తపోటు, వికారం తగ్గుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల చర్మం, జుట్టుకు ప్రయోజనం కలుగుతుంది.
ఓ పాత్రలో 2 గ్లాసుల నీరు పోయాలి. అందులో 7-10 కరివేపాకు, 3 వామాకులు, 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర గింజలు, 1 స్పూన్ జీలకర్ర గింజలు, 1 పొడి ఏలకులు, 1 అంగుళం అల్లం ముక్క వేయాలి. అనంతరం స్టవ్ వెలిగించి.. ఈ పాత్రను పెట్టాలి. మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత చల్లారనిచ్చి గ్లాసులో వడకట్టుకోవాలి. ఈ పానీయాన్ని కొద్ది కొద్ది సిప్ చేస్తూంటే.. మంచి హాయైన అనుభూతి పొందడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు నిమ్మకాయ రసం, తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఈ పానీయాన్ని తాగడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు రాలడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్, బరువు తగ్గడాన్ని మెరుగుపరుస్తుంది. కొత్తిమీర గింజలు జీవక్రియ, హార్మోన్ల సమతుల్యత, తలనొప్పి, థైరాయిడ్‌ను సమర్థవంతంగా మెరుగుపరుస్తాయి. అజీర్ణం, దగ్గు, ఉబ్బరం, మధుమేహం, ఆస్తమా, బరువు తగ్గడంలో అజ్వైన్ ఆకులు సహాయపడతాయి. జీలకర్ర గింజలు చక్కెర, కొవ్వు నష్టం, మైగ్రేన్, ఆమ్లత్వం కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. అల్లం అన్ని శీతాకాలపు వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది. గ్యాస్, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, అజీర్ణిలో సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..