AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: రుచి, వాసన తెలియడం లేదా.? అయితే మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లే వెంటనే అలర్ట్‌ అవ్వండి..

రుచి, వాసన తెలియకపోవడం మనలో చాలా మంది ఎప్పుడో అప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే. ముఖ్యంగా జలుబు చేసిన సమయంలో వాసన శక్తిని కోల్పోవడం సహజమే. కరోనా బారిన పడిన సమయంలోనూ ఇలాంటి అనుభవాన్ని చూసే ఉంటారు...

Health: రుచి, వాసన తెలియడం లేదా.? అయితే మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లే వెంటనే అలర్ట్‌ అవ్వండి..
Smell Loss
Narender Vaitla
|

Updated on: Feb 22, 2023 | 8:38 AM

Share

రుచి, వాసన తెలియకపోవడం మనలో చాలా మంది ఎప్పుడో అప్పుడు ఇలాంటి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. ఇది సర్వసాధారణంగా జరిగే ప్రక్రియే. ముఖ్యంగా జలుబు చేసిన సమయంలో వాసన శక్తిని కోల్పోవడం సహజమే. కరోనా బారిన పడిన సమయంలోనూ ఇలాంటి అనుభవాన్ని చూసే ఉంటారు. అయితే వాసన, రుచి కోల్పోవడం కూడా ఒకరకమైన అనారోగ్య సమస్య అని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల వ్యాధుల కారణంగానే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెబుతున్నారు. ఇంతకీ వాసన, రుచి ఎందుకు కోల్పోతాం, దీని వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉంటాయన్న వివరాలు మీకోసం..

వాసన, రుచి కోల్పోవడానికి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ సోకిన వారికి ఇలాంటి అనుభవం ఎదురవుతుంది. జలుబు, సైనసైటిస్ వంటి సమస్యలు తలెత్తినప్పుడు కూడా రుచి, వాసన గుర్తించే శక్తిని కోల్పోతాం. అదేవిధంగా క్యాన్సర్ బాధితుల్లోనూ కొన్నిసార్లు ఈ సమస్య తలెత్తుతుంది. రేడియేషన్ థెరపి, వివిధ మందుల ప్రభావంవల్ల నాలుక రుచిని, ముక్కు వాసనను గ్రహించదు. అయితే చికిత్స, మందుల ప్రభావం తగ్గాక క్యాన్సర్ రోగులు సాధారణ స్థితికి చేరుకుంటారు.

ఇక నోటి చిగుళ్ల ఇన్ఫెక్షన్‌ బారిన పడిన వారిపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఈ సమస్యతో బాధపడుతోన్న వారు తీసుకునే ఆహారానికి సంబంధించి రుచిని గ్రహించలేరు. ఇలాంటి వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి. అంతేకాకుండా అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఉన్నవారు కూడా రుచి, వాసన శక్తిని కోల్పోతారు. ఇలాంటి లక్షణాలు ఎప్పుడు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
మహిళా బిల్లుపై మ్యాజిక్ ఫిగర్ మోదీ సర్కార్‌కు సాధ్యమేనా?
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
అక్షయతృతీయ రోజు ఇలా లక్ష్మీపూజ చేస్తే.. మీ ఇంట్లో అష్టైశ్వార్యాలే
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
పీజీ మెడికో సురేష్ మృతి కేసు దర్యాప్తులో కీలక విషయాలు
ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?.. ఎంతకాలం తాజాగా ఉంటాయి?
ఉడికించిన గుడ్లు ఫ్రిజ్‌లో పెట్టొచ్చా?.. ఎంతకాలం తాజాగా ఉంటాయి?
రసగుల్లాలు తింటున్నాడనీ.. తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!
రసగుల్లాలు తింటున్నాడనీ.. తందూర్‌ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!
ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?
ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?
జబర్దస్త్ టాప్ కమెడియన్ల గుట్టు రట్టు చేసిన రాజమౌళి
జబర్దస్త్ టాప్ కమెడియన్ల గుట్టు రట్టు చేసిన రాజమౌళి
చిన్న అజాగ్రత్త ఎంతటి ఘోరం..!
చిన్న అజాగ్రత్త ఎంతటి ఘోరం..!
టాలీవుడ్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన శాంసన్.. అసలు మ్యాటర్ ఇదే?
టాలీవుడ్ హీరోయిన్‌కు దమ్కీ ఇచ్చిన శాంసన్.. అసలు మ్యాటర్ ఇదే?
అక్షయ తృతీయకు ఈ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లు..50 శాతం తగ్గింపుతో..
అక్షయ తృతీయకు ఈ జ్యువెలర్స్ ప్రత్యేక ఆఫర్లు..50 శాతం తగ్గింపుతో..