Winter Health: చలికాలంలో వేధించే జలుబు, దగ్గుకు వీటితో చెక్ పెట్టండి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..

చలి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదే సమయంలో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జలుబు, దగ్గు గురించి. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ముక్కు దిబ్బడ వేధిస్తుంటుంది. ముక్కు...

Winter Health: చలికాలంలో వేధించే జలుబు, దగ్గుకు వీటితో చెక్ పెట్టండి.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..
Cold Feeling

Updated on: Jan 08, 2023 | 10:41 AM

చలి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదే సమయంలో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జలుబు, దగ్గు గురించి. తక్కువ ఉష్ణోగ్రతల కారణంగా ముక్కు దిబ్బడ వేధిస్తుంటుంది. ముక్కు మూసుకుపోవడం అందరినీ ఇబ్బంది కలిగించే సమస్య. ఇది తలనొప్పి, జ్వరం, అలసట వంటి ఇతర సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఈ లక్షణాలను తగ్గించడానికి మందులు, సిరప్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ.. నివారణ చర్యలు తీసుకోవడం ఉత్తమం. సహజమైన ఆయుర్వేద నివారణలు సమస్యను పూర్తిగా నివారించడంలో సహాయపడతాయి. జలుబు, దగ్గును నివారించడానికి కొన్ని మూలికలు, సుగంధ ద్రవ్యాలను వినియోగించవచ్చు. తులసిని ఆయుర్వేదంలో మూలికల రాణి అని పిలుస్తారు. రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా జలుబు, దగ్గుకు వ్యతిరేకంగా పోరాడే సామర్థాన్ని మెరుగుపరుస్తుంది.

తులసి ఆకులు దగ్గు నుంచి ఉపశమనం కలిగించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఉదయం 4-5 తులసి ఆకులను నమలాలని నిపుణులు సూచిస్తున్నారు. గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడే యాంటీమైక్రోబయల్ లక్షణాలతో తేనె నిండి ఉంటుంది. పడుకునే ముందు ఒక టీస్పూన్ తేనె తీసుకుంటే దగ్గు తీవ్రత తగ్గుతుంది. ఇది ఛాతీ భారాన్ని కూడా తగ్గిస్తుంది. తేనె.. గొంతు నొప్పికి మాత్రమే కాకుండా జీర్ణక్రియకు, జీవక్రియకు మెరుగ్గా పని చేస్తుంది. అదనపు ప్రయోజనం కోసం తులసి లేదా అల్లం రసంతో తేనెను కలిపి తీసుకుంటారు.

హల్దీ లేదా పసుపును ఔషధ ప్రయోజనాల కోసం చాలా ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. శ్వాసకోశ ఇబ్బందుల నుంచి పసుపు ఉపశమనం ఇస్తుంది. ఇందులో ఉండే కర్క్యుమిన్.. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిహిస్టామైన్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వైరస్ తో పోరాడేందుకు సహాయపడతాయి. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఉసిరిలో శక్తిమంతమైన యాంటీ బాక్టీరియల్ ప్రభావాలు ఉంటాయి. వీటిని పచ్చిగా లేదా పండ్ల రూపంలో తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..