Health: ఒత్తిడితో సతమతమవుతున్నారా.. మీ డైట్ లో మొలకలు ఉన్నాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

|

Aug 27, 2022 | 3:08 PM

మొలకల్లో (Sprouts) ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పప్పు ధాన్యాలతో చేసే మొలకలతో చాలా లాభాలు ఉంటాయి....

Health: ఒత్తిడితో సతమతమవుతున్నారా.. మీ డైట్ లో మొలకలు ఉన్నాయా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
Chickpea Sprouts
Follow us on

మొలకల్లో (Sprouts) ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పప్పు ధాన్యాలతో చేసే మొలకలతో చాలా లాభాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రొటీన్ అధికంగా ఉండే శనగల మొలకలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్, ఆరోగ్యకరమైన (Health) కొవ్వు అధికంగా ఉంటాయి. మొలకలలో విటమిన్ A, B6, C, K, ఫైబర్, మాంగనీస్, రైబోఫ్లావిన్, కాపర్, ప్రోటీన్, థయామిన్, నియాసిన్, పాంతోతేనిక్ యాసిడ్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. సాయంత్రం వేళ సాధారణంగా మనసు స్నాక్స్ వైపు మళ్లుతుంది. ఏమైనా తినాలని అనిపిస్తుంది. అలాంటప్పుడు మొలకలను డైట్ లో చేర్చుకోవడం వల్ల చాలా లాభాలు పొందొచ్చు. శనగలతో చేసిన మొలకల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిన్‌లు, డెల్ఫిండిన్, సైనిడిన్, పెటునిడిన్‌లతో పాటు ఫైటోన్యూట్రియెంట్‌లు, ALA లు ఉంటాయి. ఇవి రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని నివారిస్తాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చనా మొలకలలో విటమిన్ ఏ, బీ6, జింక్, మాంగనీస్ వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మొలకెత్తిన చనాలోని సంక్లిష్ట పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణమవుతాయి. కరిగే ఫైబర్ రక్తంలోకి చక్కెరల శోషణను నియంత్రిస్తుంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెరల్లో అవాంతరాలను తగ్గిస్తుంది. దీంతో ఆకలి వేస్తున్న ఫీలింగ్ ను నివారిస్తుంది. మెదడు పనితీరును పెంచుతుంది. విటమిన్ B6, కోలిన్‌ లు నరాల ద్వారా మెదడుకు, మెదడు నుంచి వచ్చే సంకేతాలను ప్రమోట్ చేయడానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..