Booster and Flu Shot: కోవిడ్‌-19 బూస్టర్ డోస్‌ – ఫ్లూ షాట్ మధ్య ఎన్ని వారాల గ్యాప్‌ ఉండాలి..? నిపుణుల కీలక విషయాలు

|

Aug 28, 2022 | 7:18 AM

Covid-19 Booster and Flu Shot: కోవిడ్‌-19 తర్వాత ఇది రెండవ అత్యంత వైరల్ శ్వాసకోశ వ్యాధిగా ఉద్భవించింది. ఆగస్టు మధ్యలో చాలా కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుతున్న కేసుల..

Booster and Flu Shot: కోవిడ్‌-19 బూస్టర్ డోస్‌ - ఫ్లూ షాట్ మధ్య ఎన్ని వారాల గ్యాప్‌ ఉండాలి..? నిపుణుల కీలక విషయాలు
Booster And Flu Shot
Follow us on

Covid-19 Booster and Flu Shot: కోవిడ్‌-19 తర్వాత ఇది రెండవ అత్యంత వైరల్ శ్వాసకోశ వ్యాధిగా ఉద్భవించింది. ఆగస్టు మధ్యలో చాలా కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుతున్న కేసుల మధ్య, ప్రతి ఒక్కరిలో ఫ్లూ షాట్ తీసుకోవాలా వద్దా అనే ప్రశ్న తలెత్తుతోంది. సర్వోదయ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్, సీనియర్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ సుమిత్ అగర్వాల్, సీజనల్ ఫ్లూ షాట్‌లను పొందడానికి వివరాలు తెలిపారు. ఫ్లూ సీజన్ ప్రారంభమయ్యే ముందు టీకా వేయాలి అని వివరించారు. ఈ రోజు మీకు ఫ్లూ షాట్ వేస్తే అది మీకు వెంటనే వ్యాధికి రోగనిరోధక శక్తిని ఇస్తుందని కాదు. సాధారణంగా, రోగనిరోధక శక్తి పెరగడానికి రెండు నుండి మూడు వారాల సమయం పడుతుంది. అయితే, ఫ్లూ వ్యాక్సిన్‌ను అందరూ వేయించుకోవడం సరికాదని కూడా ఆయన అన్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే వ్యాక్సిన్ తీసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. వారి శరీరం రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే వారు వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని ఆయన చెప్పారు.

COVID-19 బూస్టర్ షాట్ – ఫ్లూ షాట్ మధ్య వ్యత్యాసం

ఒకరు రెండు వేర్వేరు ప్రయోజనాల కోసం టీకాలు తీసుకుంటే ఆరు వారాల విరామం తర్వాత రెండవ షాట్ తీసుకోవడం ఉత్తమమని చెబుతున్నారు డాక్టర్ అగర్వాల్. COVID బూస్టర్, ఫ్లూ షాట్ మధ్య నాలుగు నుండి ఆరు వారాల గ్యాప్ ఉండటం మంచిదన్నారు. చాలా మందికి ఇంకా బూస్టర్ షాట్‌లు ఇవ్వనందున, ప్రజలు ఇప్పుడు COVID, సీజనల్ ఫ్లూ రెండింటి గురించి ఆందోళన చెందుతున్నారని డాక్టర్ ఛటర్జీ చెప్పారు. ఫ్లూ కంటే కోవిడ్ బూస్టర్ షాట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని నా సలహా ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి