Health: మెడలు వంచేస్తున్న పరికరాలు.. వాటి వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది

| Edited By: Ravi Kiran

Jul 06, 2022 | 2:45 PM

వేగంగా పెరుగుతున్న ఆధునికీకరణ, సాంకేతికతో పెను మార్పులు వచ్చాయి. కరోనా తర్వాత ఆ మార్పులు మరింత ఎక్కువ అయ్యాయి. ఫలితంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి...

Health: మెడలు వంచేస్తున్న పరికరాలు.. వాటి వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది
Neck Pain
Follow us on

వేగంగా పెరుగుతున్న ఆధునికీకరణ, సాంకేతికతో పెను మార్పులు వచ్చాయి. కరోనా తర్వాత ఆ మార్పులు మరింత ఎక్కువ అయ్యాయి. ఫలితంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. ప్రస్తుత కాలంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్లు, లాప్ టాప్ లు, కంప్యూటర్ లు, ట్యాబ్ లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అతుక్కుపోయారు. గంటల కొద్దీ వీటిని వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా మెడనొప్పి సమస్యలు తీవ్ర ఇబ్బంది పెడుతోంది. ఎంత కిందికి వంచితే మెడ మీద అంత ఎక్కువ భారం పడుతుందని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. దీంతో మెడ వద్ద వెన్నుపూసల మధ్య డిస్క్‌లు, చిన్న కీళ్లు త్వరగా అరిగిపోతున్నాయి. తద్వారా మెడ నొప్పి తీవ్రమవుతుంది. కొందరికి స్వల్పంగా నొప్పి కలుగుతున్న భావన, మరికొందరిలో లోపలేదో బాదుతున్నట్టు తీవ్రంగా నొప్పి వచ్చే సూచనలున్నాయి. గతంలో పెద్ద వయసు వారికి మాత్రమే మెడ నొప్పి ఉండేది. కానీ ఇప్పుడు ఫోన్ల పుణ్యమా అని చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ మెడ నొప్పికి గురవుతున్నారు.

ఎలక్ట్రానిక్ పరికరాల వాడకంతో మెడ నొప్పి వచ్చాక బాధ పడటం కన్నా అది రాకుండా చూసుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. మెడ మరీ కిందికి వంచకుండా చూసుకోవాలి. పరికరాల వాడకం తగ్గించుకోవాలి. 10-15 నిమిషాల కన్నా ఎక్కువ సేపు మొబైల్‌ ఫోన్లు వాడకుండా చూసుకోవాలి. టేబుల్ పైన మొబైల్‌ స్టాండ్‌కు ఫోన్‌ బిగించి వాడుకోచ్చు. ఇలాంటి జాగ్రత్తలతో మెడ నొప్పి ముప్పును తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

నోట్.. ఇందులో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కొరకు మాత్రమే. వీటికి పాటించే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.