Health Benefits of Watermelon : ఎండాకాలం వచ్చేస్తోంది. ఈ సీజన్ లో పుచ్చకాయ తినడం వల్ల ప్రయోజనాలెన్నో..!!

పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో 92శాతం నీరు ఉంటుంది. అందుకే దీన్ని అందరూ ఇష్టంగా తింటుంటారు. పుచ్చకాయను వేసవిలో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

Health Benefits of Watermelon : ఎండాకాలం వచ్చేస్తోంది. ఈ సీజన్ లో పుచ్చకాయ తినడం వల్ల ప్రయోజనాలెన్నో..!!
Water Melon

Edited By:

Updated on: Feb 13, 2023 | 10:43 AM

వేసవికాలం వచ్చేస్తోంది. ఈ సీజన్ లో పుచ్చకాయలు విరివిరిగా లభ్యం అవుతాయి. ఈ పండులో 92శాతం నీరు ఉంటుంది. ఎండాకాలంలో ఈ పుచ్చకాయను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. శరీరానికి చాలా శక్తి వస్తుంది. పుచ్చకాయలోని పొటాషియం, ఐరన్, కాల్షియం, రాగి, మెగ్నీషియం, విటమిన్ ఎ, విటమిన్లు బి 1, బి 6, సి, డి, లైకోపీన్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే ఈ పండు ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అంతేకాదు ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ ఎండ వేడిమి నుంచి రక్షిస్తాయి. శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతాయి. అంతేకాదు పుచ్చకాయ బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల డీ హైడ్రేషన్ నివారిస్తుంది. శరీరాన్ని నిరంతరం హైడ్రేట్ గా ఉంచుతుంది. అందుకే వైద్యులు వేసవిలో పుచ్చకాయను ఎక్కువగా తినాలని సూచిస్తారు.

సరైన ఎంపిక:

వేసవి ప్రారంభం అవ్వగానే రోడ్లపై, మార్కెట్లో పుచ్చకాయలు కనిపిస్తుంటాయి. చాలా మంది పచ్చగా కనిపించే పుచ్చకాయలను కొంటుంటారు. తాజాగా ఉంటాయనుకుంటారు. కానీ అలాంటి కాయలు పూర్తిగా పండక..చప్పగా ఉంటాయి. నిజానికి పూర్తిగా పండిన పుచ్చకాయ ముదురు పచ్చరంగులో ఉంటుంది. అలాంటి పుచ్చకాయలే రుచిగా ఉంటాయి.

పరిమాణంతో సంబంధం లేదు

పుచ్చకాయ పెద్దగా ఉంటే బాగుంటుందని అపోహ పడతారు. కానీ అది నిజం కాదు. పుచ్చకాయ రుచికి దాని పరిమాణానికి ఎలాంటి సంబంధం ఉండదు. కాయ ఏ పరిమాణంలో ఉన్నా సరే పట్టుకున్నప్పుడు మాత్రం బరువుగా ఉండాలి. అలా బరువుగా ఉండే కాయ లోపల నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. అందుకే సాధారణ పరిమాణంలో ఎక్కువ బరువు ఉన్న కాయలను సెలక్ట్ చేసుకోవాలి.

మచ్చలు

కొన్ని పుచ్చకాయలపై ఒకవైపు తెలుపు, మరోవైపు గోధుమరంగు మచ్చలు కనిపిస్తుంటాయి. ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత రుచిగా ఉంటుందని అర్థం. కొన్నికాయలపై పిచ్చిగీతలు గీసినట్లుగా ఉంటాయి. ఈ కాయలు కూడా రుచిగా ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు:

-పుచ్చకాయతినడం వల్ల కడుపు శుభ్రంగా ఉంటుంది. ఎక్కువగా ఆకలి అనిపించదు.

-శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది.

-ఈ పండులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉన్నందున అనేక వ్యాధులను నివారిస్తుంది.

-వ్యాయామం తర్వాత పుచ్చకాయ తింటే శరీరంలో వాపు తగ్గుతుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది.

-వేసవిలో పుచ్చకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది.

-చల్లనినీళ్లతోపాటు పుచ్చకాయను తింటే ఆరోగ్యానికి ఏంతో మేలు.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి