AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్ తెగ లాగించేస్తున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే

సండే వచ్చిందంటే చాలు.. నాన్‌ వెజ్‌ ఉండి తీరాల్సిందే. పండగొచ్చినా.. బంధువులు వచ్చినా నాన్‌వెజ్‌ వండటం సర్వసాధారణం. మనలో చాలా మంది నాన్‌వెజ్‌ ప్రియులున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడొక బ్యాడ్‌ న్యూస్‌. కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యలు..

ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్ తెగ లాగించేస్తున్నారా.? అయితే ఈ విషయాలు తెలిస్తే
Non Veg
Ravi Kiran
|

Updated on: Jul 19, 2024 | 8:55 PM

Share

సండే వచ్చిందంటే చాలు.. నాన్‌ వెజ్‌ ఉండి తీరాల్సిందే. పండగొచ్చినా.. బంధువులు వచ్చినా నాన్‌వెజ్‌ వండటం సర్వసాధారణం. మనలో చాలా మంది నాన్‌వెజ్‌ ప్రియులున్నారు. అలాంటి వారందరికీ ఇప్పుడొక బ్యాడ్‌ న్యూస్‌. కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపలు, రొయ్యలు అనే తేడా లేకుండా అన్నింటి పెంపకంలో యాంటీ బయాటిక్స్‌ వాడకం బాగా పెరిగింది. దీంతో వాటిలో మల్టీ డ్రగ్‌ రెసిస్టెన్సీ ఎక్కువైపోతోంది. ఈ విషయాలు అధికారుల స్టడీలో బయటపడ్డాయి. ఈ విషయం వెలుగు చూడటంతో మాంసాహారుల్లో ఆందోళన మొదలైంది.

ఇది చదవండి: చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నాడు.. తీరా మూత ఓపెన్ చేయగా

రెండు తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో 2019 నుంచి 2022 మధ్యకాలంలో శాంపిల్స్‌ సేకరించి పరీక్షించటంతో అసలు విషయం బయటపడింది. పలు రకాల బ్యాక్టీరియ ఆనవాళ్లపై కూడా పరిశోధనలు జరిగాయి. వీటిలో బర్రెలు, ఆవులు తప్ప మిగిలినవన్నింటిలో యాంటీ బయాటిక్స్‌ అవశేషాలు అధికంగా ఉన్నట్టు తేలింది. పరిశోధనల్లో తేలిన విషయంతో ఏం తినాలన్నా ఇప్పుడు మాంసాహారులు భయపడే పరిస్థితులు వచ్చాయి. వారానికి ఒక సారైనా ముక్క ముట్టందే మనోళ్లకు ముద్ద దిగదు. కానీ నాన్‌వెజ్‌లో యాంటీ బయాటిక్స్‌ చేరికతో మనిషుల ఆరోగ్యంపై తీవ్రంగా ప్రభావం చూపుతున్నది. ఒక్కసారిగా నాన్‌వెజ్‌ తినే అలవాటును మానుకోలేక.. తిని రోగాల బారిన పడే ధైర్యం లేక నానా అవస్థలు పడుతున్నారు. మరి దీనికి ప్రత్యామ్నాయంగా నాన్‌ వెజ్‌ ప్రియులు దేన్ని ఎంచుకుంటారో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అంబానీ సంపద కరగాలంటే ఎన్నేళ్లు పడుతుందో తెల్సా..? లెక్కలు చూస్తే షాకే

ఇటీవలి కాలంలో కోళ్ల పెంపకం ఫాస్ట్‌గా జరిగిదేందుకు వాటికి స్టెరాయిడ్స్‌ ఇస్తున్నారని వైద్యులు వెల్లడించారు. స్టెరాయిడ్‌ ఇచ్చిన కోళ్ళను తినటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని, వాంతులు, విరేచనాలు, ఫుడ్‌ పాయిజన్‌ వంటివి వచ్చే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోగాల బారిన పడకూడదంటే ఫారమ్‌లలో ఉన్న కోళ్ళను కాకుండా.. ఇంట్లో పెంచుకునే కోళ్లను తినాలని సూచిస్తున్నారు. స్టెరాయిడ్‌ వంటివి లేని మాంసం తినటం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

మాంసం విక్రేతలు నిబంధనలు పాటించేలా ర్యాండమ్‌గా చెక్‌ చేస్తుంటామని.. ఒక వేళ ఎవరైనా రూల్స్‌ ఉల్లంఘించినట్లయితే చర్యలు తీసుకుంటామని విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్‌ వెటర్నరీ అధికారి తెలిపారు. విక్రయించటానికి పనికిరాని.. కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తుంటే.. ఆ దుకాణాలను సీజ్‌ చేస్తామని కూడా ఆయన చెప్పారు. వ్యాపారుల లాభాపేక్ష వల్ల మార్కెట్లో దొరికే మాంసం విషంగా మారి అది తిన్న వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతున్నది. జంతువుల క్వాంటిటీ కోసం క్వాలిటీని పక్కన పెడుతున్నారు. ఇలాంటి వారిని అధికారులు ఉపేక్షించరాదని నాన్‌వెజ్‌ ప్రియులు కోరుతున్నారు.

ఇది చదవండి: ముఖం ఆకృతి మీలోని సీక్రెట్స్‌ను ఈజీగా చెబుతుందట.. అదెలాగంటే.?

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఎల్‌ఐసీపై ఓ తల్లి పోరాటం, రూ. 1.26 కోట్లు చెల్లించాలన్న కోర్టు!
ఎల్‌ఐసీపై ఓ తల్లి పోరాటం, రూ. 1.26 కోట్లు చెల్లించాలన్న కోర్టు!
డ్రైవర్ సమయస్ఫూర్తికి నెటిజన్ల సెల్యూట్!
డ్రైవర్ సమయస్ఫూర్తికి నెటిజన్ల సెల్యూట్!
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
స్నానం చేసిన వెంటనే ఏసీ రూమ్‌లోకి వెళ్తే ఏమవుతుంది..?
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
పక్షుల కిలకిలరావాలతో మీ తోట మురిసిపోవాలా? అద్భుతమైన టిప్స్ ఇవే!
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
ఈ పనులను జూన్ 15వ తేదీలోగా పూర్తి చేయండి.. లేకపోతే భారీ నష్టాలు..
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
భారత నావికుల మృతిపై ఇరాన్ సంతాపం..!
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
సౌత్ ఇండస్ట్రీలో చార్లీ చాప్లిన్.. 40 ఏళ్లు నవ్వించిన నవ్వుల రేడు
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
ఫోన్ చేసి ఇంట్లో అందరినీ పేర్లతో అడుగుతాడు: కోదండరామిరెడ్డి
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
మీ ఆధార్ నంబర్‌తో వేరేవాళ్లు మీ అకౌంట్ నుంచి డబ్బులు విత్ డ్రా..
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్
అల్లం కొంటున్నారా? అయితే జాగ్రత్త! నకిలీ గుర్తించే సింపుల్ ట్రిక్