Chapathi Vs White Rice: రాత్రి పూట అన్నం తినాలా? లేక చపాతి తినాలా? ఏది మంచిది.. ఇది తెలుసుకోండి.!

|

May 16, 2024 | 6:00 PM

ఊబకాయం లేదా ఒబేసిటీ.. ఈ మధ్యకాలం చాలామందిని వేధిస్తున్న సమస్య. ఉరుకుల పరుగులు జీవితం.. పైగా రోజురోజుకూ మారిపోతున్న లైఫ్‌స్టైల్‌తో ఈ కాలం యువతను ఈ సమస్య పట్టిపీడిస్తోంది. రెగ్యులర్ డైట్‌లో క్యాలరీలు ఎక్కువ కావడం, శారీరిక శ్రమ లేకపోవడం.. అలాగే టైంకి సరిగ్గా తినకపోవడం..

Chapathi Vs White Rice: రాత్రి పూట అన్నం తినాలా? లేక చపాతి తినాలా? ఏది మంచిది.. ఇది తెలుసుకోండి.!
Eat Chapati At Night
Follow us on

ఊబకాయం లేదా ఒబేసిటీ.. ఈ మధ్యకాలం చాలామందిని వేధిస్తున్న సమస్య. ఉరుకుల పరుగులు జీవితం.. పైగా రోజురోజుకూ మారిపోతున్న లైఫ్‌స్టైల్‌తో ఈ కాలం యువతను ఈ సమస్య పట్టిపీడిస్తోంది. రెగ్యులర్ డైట్‌లో క్యాలరీలు ఎక్కువ కావడం, శారీరిక శ్రమ లేకపోవడం.. అలాగే టైంకి సరిగ్గా తినకపోవడం.. ఇవి జరుగుతున్నాయ్. ఇక ఇలా ఉంటే మీ ఆరోగ్యానికే ప్రమాదమని అంటున్నారు వైద్య నిపుణులు. ఇదిలా ఉండగా.. చాలామంది రాత్రుళ్లు అన్నం బదులుగా జొన్న రొట్టెలు, రోటీ లేదా చపాతీలు లాంటివి తింటుంటారు. రాత్రిపూట ఎక్కువగా వైట్ రైస్ బదులే.. ఈ చపాతీలు తినడానికే ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే.! చ‌పాతీల‌ను త‌యారు చేసే గోధుమ‌పిండిలో విట‌మిన్ బీ, ఇ, కాల్షియం, ఐర‌న్‌, జింక్‌, సోడియం, పోటాషియం, మెగ్నిషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సినంత శక్తిని ఇస్తాయి. పైగా వైట్ రైస్ కంటే త్వరగా చపాతీలు జీర్ణం అవుతాయి. ఇక చపాతీలను కాల్చేటప్పుడు తక్కువ నూనె వేసి కాల్చితే.. అన్నంతో పోలిస్తే క్యాలరీలు కూడా తక్కువ ఉంటాయి. రెండు లేదా మూడు చపాతీలు తింటేనే మనకు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని వల్ల మన బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

అయితే రాత్రిపూట అప్పుడే చేసుకుని చపాతీలు తినడం కంటే.. నిల్వ ఉన్న చపాతీలు తినడం వల్ల అనేక లాభాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. మిగిలిపోయిన చపాతీలు తినడం వల్ల బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ సమతుల్యంగా ఉండటమే కాకుండా కడుపునొప్పి సమస్య కూడా ఉండదని అంటున్నారు. గ్యాస్, కాన్స్టిపేషన్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయట. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుందట. పాలల్లో నానబెట్టుకుని తీసుకునే చపాతీలతో కూడా ఇన్నే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నారు. కాగా, మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు కచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించండి.. పై వార్త కేవలం పలు అధ్యయనాలు ఆధారంగా ప్రచురితం చేసింది మాత్రమే.