Periods Tips: పీరియడ్స్ సమయంలో ఈ ఆహారం తీసుకోండి.. హ్యాపీగా ఉండండి

|

Jul 31, 2023 | 2:45 PM

పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు నీరసంగా, చికాకుగా కనిపిస్తారు. మరికొంత మంది మహిళలకు అధిక రక్తస్రావం, కడపులో నొప్పి వంటి సమస్యలు బాధిస్తాయి. ఏం తినాలన్నా పెద్దగా ఆసక్తి చూపరు. అయితే పీరియడ్స్ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వ్యక్తిగతమైన పరిశుభ్రత, జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కేవలం నెలసరి సమయంలోనే కాకుండా..

Periods Tips: పీరియడ్స్ సమయంలో ఈ ఆహారం తీసుకోండి.. హ్యాపీగా ఉండండి
Periods Precautions
Follow us on

పీరియడ్స్ సమయంలో చాలా మంది మహిళలు నీరసంగా, చికాకుగా కనిపిస్తారు. మరికొంత మంది మహిళలకు అధిక రక్తస్రావం, కడపులో నొప్పి వంటి సమస్యలు బాధిస్తాయి. ఏం తినాలన్నా పెద్దగా ఆసక్తి చూపరు. అయితే పీరియడ్స్ సమయంలో మంచి పోషకాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వ్యక్తిగతమైన పరిశుభ్రత, జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. కేవలం నెలసరి సమయంలోనే కాకుండా.. కాస్త ముందు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా నెలసరి సమయంలో వచ్చే సమస్యలను సులభంగా అధిగమించవచ్చని పేర్కొన్నారు.

-పీరియడ్స్ సమయంలో వేడి వేడి అల్లం టీ ఒక కప్పు తాగడం వల్ల.. బుతుస్రావం మొక్క కొన్ని లక్షణాలను మెరుగుపరుస్తుంది. ఇది కండరాల నొప్పిని తగ్గిస్తుంది.

-ఫ్రెష్ గా ఉండే పండ్ల రసాలు, తక్షణ శక్తిని ఇచ్చే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నీళ్లు ఎక్కువగా తాగాలి. పెరుగు, ఒమేగా-3 అధికంగా ఉండే నట్స్, కూరగాయలు, పండ్లు వంటి వాటిని తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

-ఈ సమయంలో అధిక రక్తస్రావం వల్ల శరీరం ఎక్కువ మొత్తంలో రక్తాన్ని కోల్పోతుంది. నీరసం వంటివి లేకుండా ఉండేందుకు పౌష్టికాహారం తీసుకోవడం మంచిది.

-అలాగే ఐరన్ అధికంగా లభించే ఆహారాలను తీసుకోవాలి. ఎందుకంటే కోల్పోయిన రక్తాన్ని తిరిగి భర్తీ చేసేందుకు ఈ తరహా ఆహారాలు తోడ్పడతాయి. బచ్చలికూర, అరటిపండు, గుమ్మడికాయ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. పప్పులు, మిల్క్ షేక్ లు, పెరుగు, పాలు, గుడ్డు, చేపలు, మొలకెత్తి ధాన్యాలు మొదలైనవి తీసుకోవాలి.

-రీరంలో కాల్షియం కొరత ఉండకూడదు. లేదంటే కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటారు. ఇందుకోసం కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ చాలా మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్‌లో ఐరన్, మెగ్నిషియం ఎక్కువగా ఉండడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.

-అదే క్రమంలో ఎక్కువ మోతాదులో ఉప్పు, పంచదార, కాఫీ, మద్యం, స్పైసీ ఫుడ్స్, రెడ్ మీట్, వంటివాటిని తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి